రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ సృష్టించిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్‌కు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెల మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా సుమారు 9 వేల లోపు కరోనా కేసులు నమోదుకాగ, తాజాగా ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 90వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర…
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతర్గత కమిటీల ఏర్పాటు లక్ష్యంగా కమిషన్ పని చేస్తుందని, మహిళా కమిషన్ ఈ రెండున్నర సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, చిన్నారులపై అత్యాచారాలు పైనా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ జోక్యంతోనే అరెస్టులు జరిగాయన్నారు.…
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఏడున్నర ఏళ్లుగా డైరెక్టుగా అలయెన్స్ లో ఉన్నారని, అందుకే టీఆర్‌ఎస్ కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 120 ఏళ్ల సింగరేణి సంస్థకు ఎంతో ఘన…
గత అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…
కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఆదేశాలను మీరితే ప్రాసిక్యూషన్…
కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నట్లు…