మీడియాపై స్టార్ హీరోయిన్ సెటైర్!

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిపోయింది. దాంతో ఆమెకు కాస్తంత సమయం చిక్కినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై సమ్ము దృష్టి పెట్టింది. ఆ మధ్య సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లోని తన పేరులోంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దాంతో నెటిజన్లతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్స్ సైతం సమంత, నాగ చైతన్య మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయేమో అనే సందేహాలను వ్యక్తం చేశాయి. అప్పుడు సమంత మౌనం వహించింది తప్పితే తన నిర్ణయానికి కారణం మాత్రం చెప్పలేదు.

తాజాగానూ ఇదే అంశంపై కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియచేసి, అక్కినేని కుటుంబంతోనే తాను ఉన్నాననే రీతితో ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. అంతేకాదు… ఇటీవల ఓ ఉత్తరాది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తనపై వస్తున్న రూమర్స్ కు వివరణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడే వాటిపై స్పందిస్తానని స్పష్టం చేసింది.

చిత్రం ఏమంటే… సమంత ఇచ్చిన హింట్స్ తో మీడియా దాదాపు సైలెంట్ అయ్యింది. కానీ ఆమెకు ఈ రూమర్స్ కారణంగా నిద్ర కరువైనట్టుగా కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రతి రోజూ దీనికి సంబంధించిన ఏదో ఒక కొటేషన్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా మీడియా వాస్తవాలను ఎలా వక్రీకరిస్తుందో తెలియచేస్తూ ఓ ఫోటోను పెట్టింది. పై భాగంలో ఓ కుక్క క్రూరంగా పొడవాటి కోరల్లాంటి పళ్ళతో భయంకరంగా కనిపిస్తూ ఉంది. దాని కిందే రెండు కుక్కలు క్యూట్ గా, హ్యాపీగా ఉన్నాయి. మీడియా సత్ సంబంధాలను సైతం చాలా క్రూరంగా చూపుతోందనే అర్థం వచ్చేలా ఈ ఫోటో ఉంది. దీనిని పోస్ట్ చేసి, ఇన్ డైరెక్ట్ గా మీడియా మీద తన అక్కసును సమంత తీర్చుకున్నట్టుగా అనిపిస్తోంది.

ఏదేమైనా… ఒక్కసారి డైరెక్ట్ గా మీడియా ముందో లేక సోషల్ మీడియా ద్వారానో అక్కినేని కుటుంబంతోనూ, భర్త నాగ చైతన్యతోనూ తనకు ఎలాంటి ఇష్యూస్ లేవని, ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేస్తే సరిపోతుంది. ఆ పని చేయకుండా సమ్ము ఇలా డొంకతిరుగుడుగా పోస్టులు పెడితే ఉపయోగం ఏముంటుంది!?

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-