తన ఊబకాయం గురించి మాట్లాడిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షోకి ప్రజాదరణ బాగానే ఉంది. ఎన్టీఆర్ వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగులో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ షో సక్సెస్ లో ఎన్టీఆర్ దే ప్రధాన భూమిక అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతానికి వస్తే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తోనే నెట్టుకు వస్తోంది. ఈ సీజన్ లో కొత్తదనం ఏమీ లేకపోయినా… ఎన్టీఆర్ తన హూందా తనంతో గట్టెక్కిస్తున్నాడనే చెప్పాలి. ఈ షో ఆరంభం ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా రావటం కూడా ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో రాజమౌళి అతిథిగా వచ్చిన ఎపిసోడ్ ఎయిర్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ షోలో ఎన్టీఆర్ పోటీదారులతో కలసి మెలసి మాట్లాడుతూ రక్తి కట్టిస్తున్నాడు. ఇటీవల ఎపిసోడ్‌లో ఓ పోటీదారు తన బట్టతల గురించి వ్యాఖ్యానించగా ఎన్టీఆర్ సైతం తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఆరంభంలో తను ఊబకాయంతో ఉండటం వల్ల ప్రజలు అగ్లీ అని పిలిచారని గుర్తు చేశాడు. అదే ఇప్పుడు అభిమానుల మెప్పుదలకు కారణమయింది. ఏ స్టార్ హీరో కూడా తన గత జీవితాన్ని గురించి ఇంత బోల్డ్ గా చెప్పరని… ఎన్టీఆర్ చేసిన పనికి అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతే కాదు కామెంట్ సెక్షన్ లో జూనియన్ పై ప్రేమను కురిపిస్తున్నారు.

ఇకపై ఎన్టీఆర్ ని ఎప్పుడూ పాత లుక్ గురించి ట్రోల్ చేయను అని వాగ్దానం చేస్తున్నానని ఎన్.జి.ఎస్ అనే అభిమాని కామెంట్ చేశాడు. సన్నగా ఉండి పీకేది ఏముంది 20 ఏళ్ళ వయసులోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. లావుతగ్గమని అనడం సరైంది కాదు అంటూ మహేశ్ కృష్ణ అనే ఫ్యాన్ వ్యాఖ్యానించాడు. బాగా చెబుతావు అందుకే నువ్వంటే పిచ్చి మాకు అని భావన అనే అభిమాని అనగా… తారక్ ఎంతో నిజాయితీగా ఉన్నాడని మరో అభిమాని వ్యాఖ్యానించాడు. ఇలా పలు రకాల కామెంట్స్ తో అభిమానులు తారక్ ని అభినందిస్తున్నారు. చరణ్ తో కలసి తారక్ నటించిన రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధం అవుతోంది.

తన ఊబకాయం గురించి మాట్లాడిన ఎన్టీఆర్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-