4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్‌ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది.

ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ సంస్థలు నవీన్ పోలిశెట్టికి అడ్వాన్సులు ఇచ్చాయి. అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఒకటి. తమ ప్రాజెక్ట్ లో నటించటానికి నవీన్ పోలిశెట్టికి దాదాపు 4 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిందట ఈ సంస్థ. నితిన్ నటించిన ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ నవీన్ పోలిశెట్టికి స్క్రిప్ట్ వినిపించాడట. అయితే ఈ కథ నవీన్ కి నచ్చలేదట. దాంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి నవీన్ పోలిశెట్టి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇక మరో బడా సంస్థ యువి క్రియేషన్స్ కూడా నవీన్ కి అడ్వాన్స్ ఇచ్చింది, త్వరలో వారి సినిమా పట్టాలెక్కనుందట.

Related Articles

Latest Articles

-Advertisement-