అందం అనగానే అందరూ ఆడవాళ్ల గురించే మాట్లాడేస్తుంటారు. మరి మగవాళ్ల ఆందం సంగతేంటి? అదే అనుమానం వచ్చి ఓ బ్యూటీ వెబ్ సైట్ లోతైన అధ్యయనం జరిపిందట! అందులో తేలింది ఏంటంటే… బీటీఎస్ పాప్ బ్యాండ్ లోని సింగర్ ‘జిన్’ ప్రపంచంలోనే అత్యంత అందగాడట!
కిమ్ సియోక్ జిన్ పూర్తి పేరైతే అందరూ ‘జిన్’ అని షార్ట్ గా పిలుస్తారు ఈ కొరియన్ సెన్సేషనల్ సింగర్ ని. మొత్తం ఏడుగురు గాయకుల బీటీఎస్ టీమ్ లో జిన్ కూడా ఒకరు.
అయితే, అందం విషయంలో, స్టైల్ విషయంలో మాత్రం అతడికి తిరుగులేదు. ఈ విషయం చాలా సార్లు ఆయన అభిమానులు అంతర్జాలంలో తీర్మానం చేసేశారు కూడా. కానీ, లెటెస్ట్ గా ఓ వెబ్ సైట్ మొత్తం 4941 మంది ఇంటర్నేషనల్ మేల్ సెలబ్రిటీస్ ని కంప్యూటర్ టెస్ట్ కు స్వీకరించింది. అన్ని వేల మందిని ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా అందంలో తూకం వేసింది. ఒకరితో ఒకర్ని ముఖ కవళికలు, ఇంకా అనేక ఇతర అంశాల ఆధారంగా పోల్చి చూసింది. ఫైనల్ గా తేలింది ఏంటంటే… బీటీఎస్ తాలూకూ జిన్ మచ్చలేని చంద్రుడట!
యాండ్రీ బ్యూటీ స్టూడియో వెబ్ సైట్ ఫైనల్ రిజల్ట్ ప్రకారం జిన్ ముఖంలోగానీ, శరీరంలోగానీ, ఇంకే అంశంలోగానీ, కోణంలోగానీ…. అసలు మార్పుచేర్పులు అవసరమే లేదట! ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటూ ప్రకటించారు. అందుకే, ఆయన నంబర్ వన్ అందగాడు అని కూడా కితాబునిచ్చారు! ఈ సంవత్సరం బీటీఎస్ బాయ్స్ కి భలే లక్కీగా సాగుతోంది. వాళ్లు విడుదల చేసిన ‘బట్టర్, పర్మిషన్ టూ డ్యాన్స్’ పాటలు అంతర్జాతీయ రికార్డులు బద్ధలు కొడుతున్నాయి…