తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. సీఎం వాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలియదని, వాక్సిన్ తీసుకొమ్మని చెప్పడు, బీజేపీ ఒత్తిడితో గాంధీ హాస్పిటల్కి పోయిండు అని ఆయన అన్నారు. టైమ్ పాస్ కోసం కేబినెట్ మీటింగ్ పెట్టిండని, 317 జీఓపై కేబినెట్ లో చర్చించక పోవడం దుర్మార్గమని ఆయన అరోపించారు. ఉద్యోగులు వాళ్ల చావు వాళ్ళు చావాలని కేసీఆర్ అనుకుంటున్నాడా అని ఆయన విమర్శించారు. 317 జీఓను సవరింవే వరకు సీఎం వదిలి పెట్టమని, మానవత్వం లేని మనిషి… కేసీఆర్ అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.
కార్పొరేట్ స్కూల్స్ నుండి డబ్బులు దండు కోవడానికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియమన్నారు. కేసీఆర్ కి చిత్త శుద్ధి లేదని, కేసీఆర్ వరంగల్ ఎందుకు పోలేదో చెప్పాలన్నారు. మోడీ సీఎం లతో సమావేశం పెట్టినప్పుడు ఎందుకు అటెండ్ కాలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఉద్యోగులెవ్వరూ భయపడాల్సినవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తుందని.. జాగరణ దీక్ష ఘటనలో ఇంకా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.