317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 9 ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిటీ చైర్మన్ దామోదర్…
ఉద్యోగుల పరస్పర బదిలీలపై జీఓ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీఓ నెం 317ను విడుదల చేసిన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలని యుయస్పీసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ…
317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు తెలిపారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే…
317 జీవో కారణంగా మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంధ్యా తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేతి రామ్ కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రాష్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. జెత్రం నాయక్ మరణానికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో అన్నారు. Read Also: తెలంగాణ వచ్చినా.. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు…
317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలన్నారు.శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలన్నారు. స్థానిక ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, 371 డి ఇప్పటికి అమలులో ఉందని గుర్తు చేశారు. 371జీవోను సవరణ చేసే అధికారం ఎవ్వరికి…
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్‌లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు. Read Also: బీజేపీపై హరీశ్‌రావు చేస్తున్న ప్రకటనలు నిరాధారమైనవి: కృష్ణ సాగర్…
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయుల కేటాయింపులో శాస్త్రీయత లేదన్నారు. సీనియారిటీ లిస్టును ఎక్కడా ప్రదర్శించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. Read Also:రైతులకు భరోసా కల్పించేందుకు దొర బయటికి రారు: షర్మిల ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా జీవోలు తీసుకువచ్చి ఉద్యోగులను తన్నుకు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈ రోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా…