ఆ హీరోయిన్ తో నాగ చైతన్య ప్రేమ.. మధ్యలో సమంత రాకతో

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల సమంతతో విడాకుల తరువాత సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిన ఈ హీరో గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. చై- సామ్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇద్దరి మధ్య పరిచయం.. ఆ తరువాత ప్రేమ చిగురించి పెళ్ళికి దారి తీసింది అని తెలిసిందే. అయితే సామ్ కన్నా ముందు చై మరో హీరోయిన్ ప్రేమలో మునిగితేలాడంటా.. అంతా సవ్యంగా జరిగితే ఆ హీరోయిన్నే అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టేదంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనేగా.. టాలీవుడ్ హాట్ బ్యూటీ శృతి హాసన్.

చై, శృతి కలిసి ‘ప్రేమమ్’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటించకముందు నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంట.. వీరిద్దరూ చెన్నై రోడ్లన్నీ కలిసి తిరిగారంట.. చై తమ్ముడు అఖిల్ సైతం శృతితో చనువుగా ఉండేవాడంట.. ఆ తరువాత సామ్ వీరి మధ్యకు రావడం, చై కు దగ్గర కావడం.. ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయాయంట.. ఇక ఇదంతా చుసిన శృతి సున్నితంగా చై నుంచి దూరమైపోయిందంట.. దీంతో వీరి రిలేషన్ కి బ్రేక్ పడిందంట.. ఈ విషయాన్ని అప్పట్లో కొన్ని ఆంగ్ల పత్రికలూ ప్రచురించాయి. మరోసారి ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం చైతన్య సింగిల్ గానే ఉంటూ కెరీర్ పైఫోకస్ పెట్టాడు.

Related Articles

Latest Articles