మాటల్లేవ్.. ఇక ఉద్యమమే శరణ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికే ఊ అంటున్నాయా? మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాలకు మంట పుట్టిస్తోంది. దీంతో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ఉద్యోగ సంఘాలు. జనవరి 9 నుంచి ఆందోళన బాట చేపట్టాలని భావిస్తున్నాయి.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని, సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస రావు. ఇక చర్చలు ముఖ్యమంత్రి తోనే తప్ప అధికారులతో అయ్యే పని కాదని తేలిపోయిందన్నారు. ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాక అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం అన్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టమని చాలా మంది అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆర్ధిక మంత్రి, సీఎస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వంతో ఘర్షణను మేము కోరుకోవటం లేదు. కానీ ప్రభుత్వమే మా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని ఆందోళన బాటలో నెట్టేసిన పాపం ప్రభుత్వానిదే అన్నారు.
మావి గొంతెమ్మ కోరికలు కావు.. బొప్పరాజు
తమతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించారని, కింద స్థాయి ఉద్యోగులను అవమానించే రీతిలో చర్చలు జరిగాయన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మేము దాచుకున్న డబ్బులు 1600 కోట్లు 2వేల కోట్లు అయ్యాయి. ఈ బిల్లులు మార్చి లోగా చెల్లిస్తామనటం ఒక కుట్ర. మా కూలీ డబ్బులనే మేము అడుగుతున్నాం. నాలుగు డీఏలు రావాల్సి ఉందన్నారు బొప్పరాజు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నోరు విప్పటం లేదు. సీపీఎస్ ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయో తెలియదు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదన్నారు బొప్పరాజు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం మాకు ఉంది.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!