పరారీలో ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ పోలీసుల నుండి వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతూ అమృత్‌పాల్ సింగ్ పాటియాలాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా సంప్రదాయ మతపరమైన దుస్తులలో కనిపించే అమృత్‌పాల్.. పోలీసులను తప్పించుకునేందుకు వేషం మార్చాడు. చొక్కా, ప్యాంటు, జాకెట్‌తో పాటియాలా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియా ఇప్పుడు బయటపడింది. CCTV ఫుటేజీలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అయిన అమృత్‌పాల్.. అస్పష్టంగానే కనిపిస్తున్నా.. అతని కదలికలు మాత్రం రాడికల్ నేతే అని స్పష్టం చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ అమృత్‌సర్‌లోనిది, మార్చి 20న రికార్డయింది. అమృతపాల్ బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు తెలిసింది.
Also Read:Delhi excise case: సిసోడియాకు ఎదురుదెబ్బ… బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమృతపాల్ గురుద్వారాలో బట్టలు మార్చుకున్న తర్వాత బైక్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపించారు. ఆపై అతను మూడు చక్రాల మోటారు బండిపై ప్రయాణిస్తూ కనిపించాడు. అనంతరం అతను హర్యానాలోని కురుక్షేత్రలో గొడుగు కింద నడుచుకుంటూ కనిపించాడు. పంజాబ్ నుండి, అమృతపాల్ హర్యానాకు పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. అమృతపాల్‌కు పాటియాలాలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. పోలీసుల నుండి తప్పించుకోవడానికి తన రూపాన్ని మార్చుకున్నాడు. గడ్డంతో, గడ్డం లేకుండా అమృతపాల్ సింగ్ విభిన్నమైన లుక్‌లలో ఉన్న అనేక ఫోటోలను పంజాబ్ పోలీసులు విడుదల చేశారు. తద్వారా అతను తన రూపాన్ని పూర్తిగా మార్చినా గుర్తించే అవకాశం ఉంది.
Also Read:Jasprit Bumrah : బుమ్రా గాయంపై వీడని సస్పెన్స్! అసలు విషయం దాస్తున్న బీసీసీఐ..
హర్యానా నుంచి అమృతపాల్ సింగ్ ఉత్తరాఖండ్‌కు పారిపోతాడని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఎలాంటా ఆధారాలు లేవు. ఢిల్లీలోని ISBT బస్ టెర్మినల్‌లో అమృతపాల్ సాధువు ముసుగులో ఉన్నట్లు నిఘా సమాచారం అందడంతో ఢిల్లీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా దేశ రాజధానితోపాటు దాని సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అమృతపాల్ బస్సులో కాకుండా మరే ఇతర వాహనాన్ని ఉపయోగించి ఢిల్లీ సరిహద్దులోకి ప్రవేశించడంపై పంజాబ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను ఇరు రాష్ట్రాల పోలీసులు పరిశీలిస్తున్నారు.