ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమొగిపోతుంది.. 2021 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు.. ఢిల్లీలో అవార్డును అందుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.. పుష్ప రాజ్ అంటే పుష్పాలు ఉండాల్సిందే అంటూ పూల వర్షం కురిపించారు.. బన్నీ ఇంటి దగ్గర అభిమానులు భారీగా చేరి వెల్కమ్ చెప్పారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆ తర్వాత బన్నీ అవార్డును గెలుచుకొని ఇంటికి వచ్చిన సందర్భంగా భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు.. అయితే కొంత మంది కుటుంబ సభ్యులు, పుష్ప సినిమా నుంచి మెయిన్ యూనిట్ తో పాటు.. మరి కొంతమంది బన్నీ సన్నిహితులు, స్నేహితులకు మాత్రమే ఈ పార్టీని అరేంజ్ చేశారు. దీంతో ఈ పార్టీలోని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ పార్టీలో అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకులు.. అక్కడి వాళ్ళతో మందితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఉత్తమ నటుల అవార్డులు రాగా, అందులో మొదటి అవార్డు అల్లు అర్జున్ ను వరించింది.. పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డ్ వేడుకలకు తన భార్య స్నేహా.. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి హాజరయ్యాడు.. తెలుగు సినిమాకు 69 ఏళ్లుగా ఒక కలలా ఉన్న ఆ అవార్డుని సాధించి అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి కానుకగా తీసుకురావడంతో ఆయన ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. అర్జున్ మొదటి నేషనల్ అవార్డుని తీసుకు రావడమే కాదు, రీజనల్ సినిమా, కమర్షియల్ సినిమా అని తక్కువగా చూసే ఎంతో మందికి అల్లు అర్జున్ గట్టి సమాధానం చెప్పారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది..