Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sujatha Vijayakumar: తమిళ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆర్తి రవి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షల మెయింటెనెన్స్‌ను ఎలాంటి కారణం లేకుండా కోరలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ డిమాండ్ చేసినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్, ఇతర ఖర్చులకు సరైన ఆర్థిక సహాయం అందలేదని పేర్కొన్నారు. ఇంటికి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి నోటీసు వచ్చిన పరిస్థితి కూడా ఎదురైందని వెల్లడించారు.
పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచే అమెరికన్ స్కూల్లో చదువుతున్నారని, ఇది ఇద్దరు తల్లిదండ్రులు కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. వారి ఏడాది స్కూల్ ఫీజులు సుమారు రూ.86 లక్షలు ఉంటాయని, ఈ స్కూల్ ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. రవి మోహన్ పిల్లలను కలవకుండా తాము ఎప్పుడూ అడ్డుకోలేదని సుజాత స్పష్టం చేశారు. పిల్లలను కలిసేందుకు విజిటేషన్ రైట్స్ కోసం తామే కోర్టును ఆశ్రయించామని, ఆగస్టు నుంచి ప్రతి శని, ఆదివారాల్లో వారిని కలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కుటుంబ విషయాలను బహిరంగంగా తీసుకురావడం ఎవరికీ మంచిది కాదని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆర్తి తన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడుతున్నారని తెలిపారు. తాను నిర్మాతగా స్వతంత్రంగా ఎదిగానని, రవి మోహన్ సినిమాల్లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సుజాత వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రవి మోహన్ – ఆర్తి విడాకుల వ్యవహారంలో మరోసారి చర్చకు దారితీశాయి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?