Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Headlines Top Headlines 9 Pm %e0%b0%9f%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d %e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d 2

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Published Date :March 16, 2023 , 9:32 pm
By Sudhakar Ravula
Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :

దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు అంటే లెక్కలేదా..?
దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఆదేశాలు ఇచ్చినా కోర్టుకు హాజరు కాకపోవడంపై మండిపడ్డింది.. రైల్వే జనరల్‌ మేనేజర్‌ విజయవాడ డీఆర్‌ఎం కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చినా రాకపోవటంతో స్పందించిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది.. కోర్టు అంటే లెక్కలేని తనమా అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.. DRM స్థాయి అధికారిని కూడా కోర్టుకు రప్పించక పోతే హైకోర్టు ఎందుకని ప్రశ్నించింది.. బెజవాడ మధురా నగర్ దగ్గర ROB ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కాగా, గతంలోనూ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఇక కొందరు అధికారులకు హైకోర్టు శిక్షలు కూడా విధించిన విషయం విదితమే.. కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులపై మండిపడుతూనే ఉంది హైకోర్టు.

ఐఎండీ తాజా వార్నింగ్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది.. హైదదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా.. శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఐఎండీ ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి అవరించి ఉందని తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు, భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.. పిడుగుపాటు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. రాబోవు మూడు రోజుల రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.. ఇక, శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఓ ప్రటనలో పేర్కొన్నారు.

30 దాటినా పెళ్లికి నో నో.. రికార్డు స్థాయిలో పడిపోయిన మ్యారేజ్‌లు..!
ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది.. పెళ్లిని క్రమంగా వాయిదా వేస్తున్నారు నేటి యువతి.. ఉద్యోగం, సెటిల్‌మెంట్‌.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్‌ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్‌లు సతమతమవుతుండగా.. దక్షిణ కొరియాకు సైతం సవాలుగా మారింది ఈ పరిస్థితి.. ఎందుకంటే.. పెళ్లిళ్ల్లు చేసుకునే వారి సంఖ్య 2022లో రికార్డు స్థాయిలో పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతితక్కువ జననాల రేటున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటిగా ఉంది.. అక్కడి యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం వంటి కారణాలు కలవరపెడుతున్నాయి. గత సంవత్సరం వివాహం చేసుకున్న దక్షిణ కొరియన్ల సంఖ్య రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు ఉన్న దేశంలో జనాభా సమస్యలను మరింత పెంచింది. గత సంవత్సరం 192,000 జంటలు వివాహం చేసుకున్నారు, గణాంకాలు కొరియా గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఒక దశాబ్దం క్రితం 2012లో 327,000 జంటలు వివాహం చేసుకున్నారు.. ఇప్పుడు ఆ సంఖ్య 40 శాతానికి పైగా తగ్గింది. దక్షిణ కొరియా 1970 నుంచి దేశవ్యాప్తంగా వివాహాల నమోదును క్రమం తప్పకుండా నమోదు చేస్తూ వస్తుంది. మొదటి సారి వివాహం చేసుకునే పురుషుల సగటు వయస్సు 33.7 సంవత్సరాలుగా ఉంది.. ఇది రికార్డు గరిష్టం, డేటా చూపించింది, అయితే వధువుల వయస్సు కూడా వివాహానికి 31.3 సంవత్సరాల రికార్డును తాకింది. వారు ఒక దశాబ్దం క్రితం నుండి మొదటిసారి వివాహం చేసుకున్న పురుషులకు 1.6 సంవత్సరాలు మరియు మహిళలకు 1.9 సంవత్సరాల పెరుగుదలను సూచిస్తోంది.. గతేడాది పెళ్లి చేసుకున్న దాదాపు 80 శాతం జంటలు తొలిసారిగా పెళ్లి చేసుకున్నారు. దక్షిణ కొరియా తన జనన రేటులో దీర్ఘకాలిక క్షీణతతో పోరాడుతున్నందున, గత సంవత్సరం అత్యల్ప సంఖ్యలో పిల్లలు 249,000.. 2021లో మునుపటి రికార్డును బద్దలు కొట్టడం ద్వారా కొత్త డేటా వచ్చింది.

కరోనాపై కేంద్రం వార్నింగ్‌.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు లేఖ
కరోనా మరోసారి విజృంభించి అవకాశం ఉందా? అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని టెన్షన్‌ పెడుతోంది.. ఈ మధ్య క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అలర్ట్‌ అయిన కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కొత్త వేరియెంట్‌ రూపంలో దేశంలో మరోసారి కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోందనే ఆందోళన.. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. ఆరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ సహా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. కరోనా కేసులు పెరుగుతోన్న దృష్ట్యా.. మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్‌ పై కూడా దృష్టిసారించాలని ఆ లేఖలో రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఇక, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.. కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొంది. గ్రామాలు, మండలాలు, జిల్లాలు నుంచే పర్యవేక్షణ కొనసాగించాలని.. మహమ్మారి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఇక, గురువారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నాలుగు నెలల విరామం తర్వాత ఒక రోజులో 700 కంటే ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 4,623 కి చేరుకున్నాయి.

టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త
టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్‌ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఈ దాడిలో భార్య గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన మరౌనా బ్లాక్‌లోని లాల్మానియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. నిందితుడు మొదట మద్యం బాటిళ్లతో ఇంటికి వచ్చాడు. మద్యం బాటిళ్లను ఖాళీ చేసి ఆ తర్వాత దంపతులిద్దరు కలిసి తిన్నారు. తర్వాత టీ ఇవ్వమని భార్యను అడిగాడు. భార్య గ్యాస్‌పై టీ పెట్టింది. అయినప్పటికీ నిందితుడు వంటగదిలోకి వెళ్లి బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ భార్య ముఖంపై పోశాడు. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. బాధితురాలి సమాచారం ప్రకారం, ఆమె మూడు రోజుల క్రితం తన భార్య ముఖంపై వేడి చేయని యాసిడ్ పోశాడు. ఆ సమయంలో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. అయితే ఈరోజు హాట్ యాసిడ్ పోసి తీవ్రంగా గాయపడింది. దీంతో మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు.

కోహ్లీకి చేరువలో మూడు రికార్డులు.. వన్డే సిరీస్ కి రెడీ.. ?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగింది. ఈ క్రమంలో ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ లో అతడు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. అదేంటంటే.. అహ్మదాబాద్ టెస్టులో మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న విరాట్.. వన్డే సిరీస్ లో కూడా అలాగే ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా అత్యధికంగా ఈ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో నిలుస్తాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో అందుకున్న అవార్డు.. ఆసీస్ పై కోహ్లీకి తొమ్మిదోది. ఇంకొక్క అవార్డును అతడు అందుకుంటే వివ్ రిచర్ట్స్, ఇయాన్ బోథమ్ తో సమానంగా పది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో రెండో స్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడూ ఆసీస్ పై ఏకంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.

డబ్బు కోసం పవిత్ర ఎంతకైనా దిగజారుద్ది..
సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమా దగ్గర నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. పెళ్లితో ముగుస్తోంది అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక షూట్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. నరేష్.. మా పెళ్లి జరిగింది ఆశీర్వదించండి అంటూ షేర్ చేశాడు. ఇక అంతేకాకుండా దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే అందులో నిజం లేదని, అదంతా సినిమా షూటింగ్ కోసమని తెలిసి అభిమానులు వారిని తిట్టి పోశారు. నిజంచెప్పాలంటే.. వారిద్దరూ చిన్న పిల్లలు కాదు.. కుర్రవాళ్లు కూడా కాదు.. ఈ వయస్సులో వీరు ఇలాంటి పనులు చేయొచ్చా.. అని అడిగివారే ఎక్కువమంది ఉన్నారు. సరే చేస్తే చేశారు.. అది వారి పర్సనల్ విషయం. కానీ, దాన్ని ఎందుకు పబ్లిక్ చేయడం అనేది వారి వాదన. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వీరిద్దరి గురించి అంతకుముందు వీరితో కాపురం చేసిన వారు ఘాటు ఆరోపణలు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్ గురించి, అతడి క్యారెక్టర్ గురించి ఎంత నీచంగా చెప్పిందో అందరికి తెల్సిందే. తన కొడుకు కోసం వాటిని భరించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇటుపక్క పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ సైతం పవిత్ర గురించి చాలా దారుణంగా మాట్లాడడం గమనార్హం. తాజాగా తమిళ్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుచేంద్ర ప్రసాద్.. పవిత్ర గురించి, ఆమె క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. ” పవిత్రకు డబ్బు కావాలి.. ఆమె డబ్బుకోసం ఎంతకైనా దిగజారుద్ది. ఆస్తి కోసమే నరేష్ తో లవ్ ట్రాక్ నడిపింది. అతని వెనుక ఉన్న రూ. 1500 కోట్లు కోసమే అతడిని ట్రాప్ చేసి ముగ్గులోకి దింపింది. కేవలం డబ్బు పిచ్చితోనే ఆమె అంతకుముందు ఉన్న భర్తకు, నాకు విడాకులు ఇచ్చింది. నరేష్ కు ఈ విషయం అర్ధం కావట్లేదు. ఆమె పచ్చి అవకాశవాది. త్వరలోనే నరేష్ ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిన ‘లైగర్’ బ్యూటీ.. సిగ్గులేదు
అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ. విజయ్ దేవరకొండ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. అమ్మడి నటన చూసి కుర్రకారు బెంబేలెత్తిపోయారు. ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉందే అంటూ చెప్పుకొచ్చారు. ఇక అనన్య.. టాలీవుడ్ లో హిట్ కొట్టి సెటిల్ అవుదాం అనుకున్నా అదిమాత్రం కుదరనిపని అని పాపం వెనక్కి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయాలను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. బికినీ దగ్గరనుంచి అన్ని డిజైనర్ డ్రెస్ ల్లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది తన పరువును తానే అడ్డంగా తీసుకొంది. తన కజిన్ పెళ్ళిలో సిగరెట్ తాగుతూ మీడియా కంట పడింది. ఇంకేముంది నెటిజన్స్ అమ్మడిని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఒక పెళ్ళిలో అనన్య పాల్గొంది. అది పాండే కుటుంబానికి సంబంధించిన పెళ్లి అని సమాచారం. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే.. అనన్య సీక్రెట్ గా సిగరెట్ తాగుతూ కనిపించింది. ఎంతో సంప్రదాయంగా పెళ్లి జరుగుతున్న పందిరిలో ఇలా సిగరెట్ తాగడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీలు అన్నాకా.. సిగరెట్లు, మందు తాగడం చాలా కామన్. అందులోనూ చాలామంది హీరోయిన్లు సైతం సిగరెట్ తాగడం కూడా మీడియా కంటపడింది. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.. పెళ్లి మండపంలో ఇలా చేయడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఒక్క వివాదం అనన్య పరువు మొత్తం తీసేసిందనే చెప్పాలి. మరి ఈ సంఘటనపై అనన్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Top Headlines @ 9 PM on March 16th 2023
  • Top Headlines @9 PM

WEB STORIES

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

RELATED ARTICLES

Shahid Afridi : మోడీ సర్.. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ లు జరిపించండి..?

Top Headlines @1PM: టాప్ న్యూస్

MLC Kavitha ED Live: ప్రముఖ అడ్వకేట్ తో కవిత సంప్రదింపులు

Top Headlines @9AM: టాప్ న్యూస్

WPL2023 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?

తాజావార్తలు

  • Bhatti Vikramarka: మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు.. భట్టితో ఆదివాసీయుల ఆవేదన

  • Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడితో ఐరా క్రియేషన్స్ చిత్రం!

  • Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారు

  • Earth quake : ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

  • Police Vs Revenue: గుడివాడలో పోలీస్ వర్సెస్ రెవిన్యూ

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions