విజయవాడ – బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం..! 100 మంది ప్రయాణికులు సేఫ్..
విజయవాడ – బెంగళూరు విమానానికి పెను ప్రమాదం తప్పింది.. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు విమానం టేక్ ఆఫ్ అవుతోన్న సమయంలో పక్షిని ఢీకొట్టింది విమానం.. దీంతో, విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.. ఊహించని ఘటనతో షాక్ తిన్న పైలట్.. వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేశారు.. దీంతో, ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఘటన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండగా.. అందరిని విమానం నుంచి దించివేశారు సిబ్బంది.. గంట సమయం తర్వాత మరమ్మతులు పూర్తి చేసి.. తిరిగి విమానం బయల్దేరింది..
ఫ్లెక్సీ వివాదం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సీఐ సీరియస్ వార్నింగ్..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్, జనసైనికులు. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంగా మారింది.. ఆ ఫ్లెక్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించిన ఘటన నేపథ్యంలో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. ఇకపై జిల్లా పేరును ఆ సీమ… ఈ సీమ అంటూ మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైషమ్యాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పి. గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భీమరాజు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొన్నాలని స్పష్టం చేశారు పోలీసులు.. మరోవైపు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఫ్లెక్సీలు ముద్రించే షాపులు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీ గా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఐ భీమరాజు.. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లా పేరు విషయంలో ఆ సీమ.. ఈ సీమ… అని కొంతమంది ప్రచురించడం జరుగుతుంది.. ఇది సరికాదు.. ఎవరైనా సరే ఇక నుంచి ఫ్లెక్సీలో పేరు విషయంలో రెండు వర్గాల మధ్యన విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడతో పాటు.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు..
నిమ్మకూరు పర్యటనలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ నిమ్మకూరు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలోని స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.. సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తిచేసుకుని… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన నిమ్మకూరుకు వచ్చారు.. అయితే, బాలయ్యకు గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు గురుకుల పాఠశాల విద్యార్థులు. తమ అభిమాన నటుడికి మంగళ హారతిలిచ్చారు నిమ్మకూరు ఆడపడుచులు. ఇక, స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన బాలయ్య.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పద్మభూషణ్ , దేశంలో మొదటి కళాకారుడుగా బుక్ ఆఫర్ రికార్డ్స్ లో స్థానం పొందడం.. వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నాను అన్నారు నందమూరి బాలకృష్ణ.. పదవులు నాకు ముఖ్యం కాదు… వాటికే నేను అలంకారమన్నది నా భావనగా అభివర్ణించారు.. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నాను అని వెల్లడించారు.. తండ్రైన.. గురువైన… దేవుడైన నాకు అన్ని.. ఎన్టీఆరే.. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్.. దరిదాపులకు చేరాలన్నదే నా తపన.. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి.. తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం ఎనలేనిదదన్నారు..
యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. డ్యాన్స్ చేస్తుండగా ఆగిన గుండె..
ఏ ఫంక్షన్ జరిగిన సౌండ్ మోగాల్సిందే.. పెళ్లి అయినా.. రిసెప్షన్ అయినా.. ఇంకా ఏ చిన్న ఫంక్షన్ అయినా.. చివరకు వినాయకుడి దగ్గర కూడా డీజే సౌండ్స్ ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.. అయితే, ఆ డీజే సౌండ్స్ ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి.. ఇప్పటికే ఎంతోమంది డీజే సౌండ్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు. తాజాగా, విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లే.. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్స్‌కు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీష్.. ఇక లేడన్న సమాచారంతో బొబ్బాదిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. డీజే సౌండ్స్ ను నిషేధించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని డీజే సౌండ్స్ ను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ 8 మంది ట్రాన్స్‌జెండర్లు.. ఈ యాప్ ద్వారా కొనుగోళ్లు..!
హైదరాబాద్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. డ్రగ్స్ సేవిస్తున్న పది మందిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతో పాటు 8 మంది ట్రాన్స్‌జెండర్ (గే) కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీ ఎంఎస్ స్వాధీనం చేసుకున్నారు. Grinder అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ట్రాన్స్‌జెండర్లు (గే) సైతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నపుంసకులకు డ్రగ్స్ సప్లై చేసిన నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 8 మంది “గే” లే ఉండటం గమనార్హం. నేటితరం యువతతో పాటు పాఠశాల విద్యార్థుల్లోనూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని అరికట్టడానికి కేంద్రం, రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో “గే” లు సైతం చేరడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షల పెంపుతో పాటు పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్ తదితర విభాగాల సమన్వయంతో సమష్టి కార్యాచరణ చేపడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం, జాతీయ డీ-ఎడిక్షన్ హెల్ప్‌లైన్ (14446) తీసుకురావడంతో పాటు ‘నశా ముక్త్ భారత్’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మాదక ముఠాల పనిపట్టడానికి ఏపీ పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్‌వల్ల వాటిల్లే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, బాధితులకు అండగా నిలవడం వంటి వాటికీ ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే, వీటితోపాటు యువత డ్రగ్స్‌ను కోరుకోవడానికి కారణమవుతున్న సామాజిక, మానసిక అంశాలపై లోతైన అవగాహన అవసరం.
మాకు చలానా వేస్తారు కదా..? ఇప్పుడు నాకు ఫైన్ కట్టండి..
వాహనదారులకు రకరకాల ఫైన్లు వేస్తుంటారు పోలీసులు.. హెల్మెట్ లేకపోతే ఫైన్.. లైసెన్స్ లేకపోతే ఫైన్.. ఆర్‌సీ లేకపోతే వడ్డింపు.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా ఫైన్.. రెడ్ సిగ్నల్ దాటితే ఫైన్.. ఇక, ఓవర్ లోడ్, ట్రిపుల్ రైడింగ్.. ఇలా రకరకాలుగు ఫైన్లు వేస్తారు.. డ్రంకెన్ డ్రైవ్ ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పడం లేదు.. ఇవి అన్ని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన రూల్సే అయినా.. అవి బ్రేక్ చేసినవారికి ఫైన్‌లు తప్పడం లేదు.. అది సరె.. కానీ, ఇప్పుడు నాకు ఫైన్ కట్టండి అంటూ.. ఓ వాహనదారుడు.. రోడ్డుపై బైఠాయించాడు.. సామాజిక కార్యకర్త అయిన కోట శ్యామ్ కుమార్, రేకుర్తి చౌక్ వద్ద కరీంనగర్-జగిత్యాల రహదారిలో దెబ్బతిన్న ప్రాంతంలో కూర్చుని, పట్టణంలోని రోడ్లను మరమ్మతు చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి ఒక ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టాడు.. హెల్మెట్ ధరించి, దెబ్బతిన్న రోడ్డుపై కూర్చుని ప్రయాణికుల దుస్థితిని గుర్తుచేసుకున్నారు. ప్రజలు ప్రభుత్వానికి వాహన పన్ను, రోడ్డు పన్ను మరియు అనేక ఇతర పన్నులు చెల్లిస్తున్నారని, హెల్మెట్లు లేదా సీటు బెల్టులు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారని పేర్కొన్నారు.. అధికారులు జరిమానాలు వసూలు చేయడంలో చూపిస్తోన్న శ్రద్ధ.. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడంలో చూపడంలేదని ఆరోపించారు. వాహనాలను దెబ్బతీయడమే కాకుండా, గుంతలు ఉన్న రోడ్లు ప్రజలను ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్నాయని, కలెక్టర్ మరియు పోలీసు కమిషనర్ రోడ్లను సరిచేయడంలో విఫలమైనందుకు పౌరులకు ఎంత జరిమానా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఉన్నతాధికారులకు విషయం చెబుతామని చెప్పడంతో.. చివరకు ఆందోళన విమరించాడు శ్యాంకుమార్.. కానీ, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
జీఎస్టీపై మోడీ కీలక ట్వీట్
సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది. తాజాగా ఇదే అంశంపై ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కణలో భాగంగా జీఎస్టీ సంస్కరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించాలని నిర్ణయించినట్లు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటన చేయడం జరిగిందని గుర్తుచేశారు. తాజాగా జీఎస్టీ సంస్కరణలో సామాన్యులకు చిన్న మధ్యతరగతి వ్యాపారులకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వారి ఆర్థిక వ్యవస్థలు బలోపేతం చేయడమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సామాన్యులు, రైతులు, MSMEలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చేలా జీఎస్టీపై సంస్కరణలు తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర , రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమిష్టిగా అంగీకరించిందని స్పష్టం చేశారు. నూతన జీఎస్టీ స్లాబులు భారతదేశంలోని పౌరులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని, ప్రతి వర్తక వ్యాపారం చేసే వ్యక్తికి నూతన జీఎస్టీ విధానంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.
చెట్లు నరకడం వల్లే ఈ దుస్థితి.. వరదలపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్‌లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వరదలు ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో ఉన్నాయి. ప్రజలు శిబిరాలకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. కొండల్లో అక్రమంగా చెట్లు నరికివేయడం వల్లే ఈ వరదలకు కారణం అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్ర వరద తీవ్రతను ఎదుర్కొన్నాయని.. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పంజాబ్ దారుణమైన వరదను ఎదుర్కొంటోందని న్యాయస్థానం పేర్కొంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో అపూర్వమైన కొండచరియలు విరిగిపడడం వీడియోల్లో చూశామని.. ఈ వీడియోల్లో ఎక్కవగా కలప కనిపించిందని తెలిపారు. ఈ వరదలకు ప్రధాన కారణం.. అక్రమంగా చెట్టు నరికివేయడం వల్లే ఇదంతా జరుగుతుందని గవాయ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌కు నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ కోరారు.
గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
మనలో చాలామందికి ప్రతిరోజు చూస్తూన్న, చేస్తున్న పనులకు సంబంధించి అనేక విషయాలపై ఎలాంటి అవగాహనలేకుండా పనులు చేస్తూ ఉంటాము. ఇలాంటి విషయాల్లో ఒకటిగా చెప్పుకొనే విషయమేమిటంటే.. ప్రతిఒక్కరి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ పైన ఉండే మూడు అక్షరాల కోడ్ కి అర్థం ఏంటని? నిజానికి ప్రతి గ్యాస్ సిలిండర్ పైన కూడా ఒక కోడ్ ఉంటుంది. దానికి అర్థం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా ఎంతో ప్రెజర్ ని తట్టుకునేలా చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. అయితే, రోజులు గడిచే కొద్దీ బయట ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా గాని లేదా సిలిండర్ ని వాడే విధానం బట్టి గాని సిలిండర్ తుప్పు పట్టడం లేదా పగుళ్లు రావడం.. లేదా పాడవడం జరుగుతుంది. అలా పాడైన సిలిండర్లను ఉపయోగిస్తే గ్యాస్ లీక్ అవ్వడం కానీ.. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం గాని జరుగుతుంది. కాబట్టి, సిలిండర్ ని కొన్ని సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా టెస్ట్ చేయాలని ఒక రూల్ ఉంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.. నేడు విచారణ
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు సినీ, క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌ను ఈరోజు (గురువారం) విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ధావన్ 1X యాప్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తింపు. గతంలో, ఈ కేసులో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ప్రశ్నించారు. సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సాధ్యమయ్యే పెట్టుబడులను ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్ 1xBet గత సంవత్సరం డిసెంబర్‌లో సురేష్ రైనాను తన గేమింగ్ అంబాసిడర్‌గా చేసిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిషేధిత బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు 1xBet, FairPlay, Parimatch, Lotus365 ప్రకటనలలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా, మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలాను కూడా ప్రశ్నించారు. సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్రకటనలలో 1xbat, 1xbat స్పోర్టింగ్ లైన్స్ వంటి మారుపేర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ ప్రకటనలలో తరచుగా QR కోడ్‌లు ఉంటాయి, ఇవి వినియోగదారులను బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు దారి మళ్లిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ టిక్కెట్లపై 40 శాతం జీఎస్టీ.. కొత్త రేట్లు ఇవే
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త, సరళమైన పన్ను విధానం ఈ నెల 22 నుంచే అమల్లోకి రానుంది. అయితే క్రికెట్ లవర్స్ కు మాత్రం బిగ్ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను చూడటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ టిక్కెట్లు ఇప్పుడు మునుపటి కంటే ఖరీదైనవిగా మారతాయి. సెప్టెంబర్ 3 (బుధవారం)న, ఐపీఎల్, ఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్ల టిక్కెట్లపై 40 శాతం జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో ఐపీఎల్ టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. ఇప్పుడు ఐపీఎల్ టిక్కెట్లను అత్యధిక పన్ను శ్లాబ్‌లో (40 శాతం) చేర్చారు. ఇందులో క్యాసినోలు, రేస్ క్లబ్‌లు, లగ్జరీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయం తర్వాత, ఐపీఎల్ టిక్కెట్ల ధరపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. గతంలో, GST కలిపిన తర్వాత రూ. 500 ఐపీఎల్ టికెట్ రూ. 640 కి అందుబాటులో ఉండేది. ఇప్పుడు అది రూ. 700 కి అందుబాటులోకి వస్తుంది. అంటే మీరు రూ. 60 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
స్వీటీ కోసం రంగంలోకి ప్రభాస్.. దేవసేన కోసం ఏంచేసాడంటే?
లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందుకోసం రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఘాటీ రిలీజ్ ట్రైలర్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేసాడు ప్రభాస్ ప్రభాస్. రిలీజ్ ట్రైలర్ కూడా సూపర్ గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా స్వీటీ అనుష్క పర్ఫామెన్స్ వేరే లెవల్ లో ఉంది. కత్తి పట్టి స్వీటీ చేసిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా కోసం అనుష్క గట్టిగానే కష్టపడుతోంది. మీడియా ముందుకు రాకున్నా కూడా రానా తో ఫోన్ కాల్ లో ప్రమోషన్స్ తో పాటు ఎక్స్ లో డైరెక్టర్ తో కలిసి ఎక్స్ లో సినిమాకు సంబందించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ వాయిదా పడిన ఘాటీ ఎట్టకేలకు రేపు థియేటర్స్ లో రిలిజ్ అవుతోంది. వేదం తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న అనుష్క ఈ సారి తాను అరుంధతి, భాగమతి రేంజ్ హిట్ కొడుతానని ధీమాగా ఉంది. మరి రరిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ఓటీటీలో ‘కన్నప్ప’ సినిమా.. ఆలస్యంగా స్ట్రీమింగ్?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా చివరికి ఓటీటీలోకి చేరింది. అయితే, చిన్న ట్విస్ట్ కారణంగా నెటిజన్లు కొద్దిసేపు అయోమయం చెందారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా ఇందులో ఉన్న భారీ తారాగణం, మేకింగ్ విజువల్స్ వల్ల ఈ మూవీకి ఓటీటీలో మంచి క్రేజ్ ఏర్పడింది. మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో సెప్టెంబర్ 4నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కన్నప్ప’ స్ట్రీమింగ్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే నిర్ణీత సమయానికి సినిమా రాకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమాకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. చివరికి అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేయడంతో అందరికి క్లారిటీ వచ్చింది. కొద్ది గంటల ఆలస్యంగానైనా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.