బీఆర్ఎస్కు బిగ్ షాక్.. జెడ్పీ ఛైర్మన్ సహా కీలక నేతల రాజీనామా!
వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాఖాలో రాజీనామాల పర్వం మొదలైంది. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథరెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు సమావేశం నిర్వహించి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. లోకనాథరెడ్డితోపాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి సాగర్ అదే బాటలో నడుస్తున్నారు. వీరితో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమేష్ గౌడ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్ విండో అధ్యక్షులు, రైతు పోరాట సమితి గ్రామ అధ్యక్షులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తీరుతో లోక్‌నాథరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తామని ప్రకటించినా.. తమ రాజీనామాపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మధ్యాహ్నం మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఢిల్లీ ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది.
గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఈడికి ఎమ్మెల్సీ కవిత లేఖరాశారు. తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేయని తేల్చి చెప్పారు కవిత. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు.
లాభాలొస్తాయని నమ్మించి.. నిండా దోచేశారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓరోజు ఆన్‌లైన్‌లో కాలక్షేపం చేస్తుండగా.. అతనికి ఓ ప్రకటన కనిపించింది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలు వస్తాయని ఆ యాడ్‌లో పేర్కొనబడి ఉంది. దీంతో.. అతడు ఆ యాడ్‌లో కనిపించిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడు. ఇంకేముంది.. తమ వలలో చేప చిక్కుకుందని అనుకొని, అతనికి మాయమాటలు చెప్పి, డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టారు. యాప్స్‌లో పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలు వస్తాయని దుండగులు నమ్మబలికారు. దీంతో.. వివిధ లింక్స్ ద్వారా విడతల వారీగా మూడు నెలల్లో రూ.4 లక్షలు యాప్‌లో పెట్టుబడులు పెట్టారు.
కట్ చేస్తే.. ఆ యువకుడికి ఎలాంటి లాభాలు రాలేదు. అలాగే, ఫలానా వ్యక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో తాను మోసపోయానని భావించిన యువకుడు, కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యాప్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి, సైబర్ చీటర్స్ తన వద్ద నుంచి రూ.4 లక్షలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే.. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా అతడిని సూచించారు.
వైరల్ ఫీవర్స్, వడదెబ్బపై అప్రమత్తం.. జూమ్ ద్వారా మంత్రి రజిని సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల DM&HOలు, 16 GGHల సూపరింటెండెంట్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బపై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఏర్పాట్లపై డిఎంహెచ్ఓలకు పలు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీలైతే స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు.
31ఏళ్ల మహిళను తల్లిని చేసిన 13ఏళ్ల బాలుడు
యువకులు ఆంటీలపై మోజు కలిగి ఉంటారని వింటుంటాం.. కానీ ఒక స్త్రీ తన కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఘటన షాకింగ్ కు గురిచేస్తుంది. ఈ ఘటన అమెరికాలోని కొలరాడో నగరంలో చోటుచేసుకుంది. ఆండ్రియా సెరానో, 31, 13 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఇంటి పనిలో ఆమెకు సహాయం చేయడానికి ఆమె అతన్ని వెంట తీసుకు వచ్చింది. ఇద్దరూ నెలల తరబడి కలిసి ఉండేవారు. చుట్టుపక్కల వారు కూడా ఆండ్రియాను అబ్బాయికి తల్లిలా భావించారు. ఆ తర్వాత ఓ రోజు అకస్మాత్తుగా ఆ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ఆండ్రియా.. విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరింది. అతడిపై మోజుతో పలుమార్లు ఇంటికి పిలిచి శారీరకంగా కలిసింది. చివరకు ఆమె గర్భం దాల్చడంతో సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది.
సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదేనా.. కళ్లు మూసుకోమని కత్తితో కోసేశాడు
హర్యానాలోని సోనేపట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లై 17రోజులు అయింది. భర్త తన భార్యను నీకో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంది బయటికి వెళ్తాం పద అని తీసుకెళ్లాడు. భర్త మాటలు నమ్మి పొలాల్లోకి వెళ్లింది భార్య. బహుమతి ఇస్తానని చెప్పి కళ్లుమూసుకొమ్మన్నాడు. కత్తి తీసి మెడ కోసేశాడు. భార్య అరుపులకు బయపడి అక్కడ నుంచి పరారయ్యాడు. గాయపడ్డ భార్య ఎలాగోలా ఇంటికి చేరుకోగా కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
బొట్టుపెట్టుకోలేదని మహిళను తిట్టిన బీజేపీ ఎంపీ..
కర్ణాటక బీజేపీ నేత, కోలార్ ఎంపీ ఎస్ మునిస్వామి జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళల సేల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఒక దుకాణం వద్ద వస్తువులను విక్రయిస్తున్న మహిళ యజమాని నుదిటిపై బొట్టు లేకపోవడంతో ఎంపీ బహిరంగంగా తిట్టారు. మొదటగా బొట్టు పెట్టుకోండి.. మీ భర్త బతికే ఉన్నాడు కదా..? మీకు ఇంగితజ్ఞానం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
జ్వరంతో కాన్పూర్ విలవిల.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం..
ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉండటంతో జనాలు భయపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరం జ్వరంతో అల్లాడిపోతోంది. అక్కడ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాన్పూర్ లోని హాల్లెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోజులోనే జ్వరంతో, ఇతర జలుబు లక్షణాతో 200 కేసులు వచ్చాయి. వీరిలో 50 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా జనాలు పోటేత్తుతున్నారు. ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వ్యాపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
పాకిస్తాన్ కవ్విస్తే అంతే.. మోదీ హయాంతో భారత్ సైనికంగా స్పందించే అవకాశం..
అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో సైన్యం ధీటుగా స్పందించే అవకాశం ఉందని తెలిపింది. భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలుగా ఉన్నందుకు వీటి మధ్య సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. గతంలో భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చిన్న ఘటన అటువైపు నుంచి వచ్చిన ప్రతిస్పందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నివేదిక అంచానా వేసింది.
యుద్ధాలను గెలవడానికి వ్యూహాలు రచించండి .. సైన్యానికి జిన్ పింగ్ దిశానిర్దేశం..
చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షణ వనరులను ఉపయోగించుకుని మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సైన్యం వార్షిక ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
సమీకృత వ్యూహాత్మక సామర్థాలను ఏకీకృతం చేయడం, మెరుగుపరచడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ చేత నిర్ణయించబడిన కొత్త అవసరం అని ఆయన అన్నారు. చైనా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి రక్షణ శాస్త్ర, సాంకేతికతను మెరుగ్గా వినియోగించుకోవాలని సూచించారు.
బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ మృతి
బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ (66) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని ట్విటర్ మాధ్యమంగా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ధృవీకరించారు. 45 ఏళ్లుగా సాగుతున్న తమ స్నేహం.. ఈరోజుతో ముగిసిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఈ ప్రపంచంలో మరణం అనేది అంతిమం అని నాకు తెలుసు. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ గురించి ఇలా రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా 45 ఏళ్ల స్నేహబంధం నేటితో ముగిసింది. నువ్వు లేని జీవితం, ఇక నుంచి మునుపటిలా ఉండదు మిత్రమా’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ఇతర సినీ ప్రముఖులు సతీష్ కౌశిక్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తొలి విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ జట్టు
ముంబైలో తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ 5 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు మరో జట్టుతో 2 సార్లు ఆడాలి. లీగ్ రౌండ్ ముగిసే సమయానికి టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంటాయి. ఈ సిరీస్‌లో గత రాత్రి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన 6వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్ సబినేని మేఘన 8 పరుగుల వద్ద మేగన్ స్కట్ వేసిన బంతిని వికెట్ కీపర్ రిచా ఘోష్‌కి క్యాచ్ ఇచ్చింది.
రవిశాస్త్రివి అన్నీ ఒట్టి మాటలే.. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆస్ట్రేలియాతో ఇండోర్ టెస్టులో భారత జట్టు ఓడిపోయిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు. 2014 తర్వాత ఏడేళ్లలో ఆరేళ్లపాటు భారత జట్టుకు శాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్నారు. మూడో టెస్టులో అతివిశ్వాసం కారణంగానే టీమిండియా ఓడిందంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి చెత్త వ్యాఖ్యలను మేం పట్టించుకోం అని రోహిత్ అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మరింతగా స్పందిస్తూ..”నిజాయితీగా చెప్పాలంటే మేం తొలి రెండు టెస్టు లు గెలిచాం. అయితే ఆ గెలుపుని బయటి వ్యక్తులు అతి విశ్వాసం అంటున్నారు. ఆ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి.
ఎందుకుంటే ఏ జట్టు అయినా ఉత్తమ ప్రదర్శన ఇచ్చి, విజయం సాధించడానికే చూస్తాయి. ఇక అతి విశ్వాసం అని చెప్పే వాళ్లకు డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి వారు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు” అని రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించాడు. గురువారం నుంచి అహ్మదాబాద్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఈమేరకు స్పందించాడు.