ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్
ఏపీలో ఉన్నత విద్యాశాఖ పై సమీక్ష చేపట్టారు ముఖ్యమంత్రి జగన్. డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలని జగన్ సూచించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్ చేసుకోవాలి. రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే జూన్ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి.ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం.ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి.ప్రతి విద్యాసంస్థ నాక్ అక్రిడిటేషన్ సాధించాలి.మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించాలి.అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి.కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి.
టీచర్ల ప్రమోషన్ల వివాదంపై చర్చించాం
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం ముగిసింది. ఉపాధ్యాయుల ప్రమోషన్ల వివాదం పై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు మంత్రి బొత్స. మూడో తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 12 వేలమంది సబ్జెక్టు టీచర్స్ అవసరమని గుర్తించాం.కొంతమంది ఉపాధ్యాయ సంఘ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ జీవోపై న్యాయస్థానానికి వెళ్లారు. ఉపాధ్యాయులకు బదిలీల్లో ఇబ్బంది లేకుండా టీచర్స్ కి 2500 అలవెన్స్ లు కూడా ఇచ్చాము.ప్రజాస్వామ్యం లో స్వేచ్ఛ ఉంది ఎవరైనా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు .అయ్యన్నపాత్రుడు మాట్లాడిన తీరు సరిగా లేదు. రాజ్యాంగ పదవులు చేసిన వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు ఎన్టీఆర్ వర్ధంతిని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు .ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. జీవో నంబర్ 1 పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స.
గజరాజుల విధ్వంసం.. వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు
పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు.. ఏపీలోని ఏజెన్సీ వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అటు కర్నాటక, ఇటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల్లో ఏనుగులు వీరవిహారం చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గల జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలోకి గత అర్దరాత్రి ఏడు గజరాజుల గుంపు ఎస్టీ వీధిలోకి చొరబడి అక్కడ ఉన్న రెండు(2) ఎలక్ట్రికల్ 100 కెవిఈ లైన్ ట్రాన్స్ఫార్మర్స్, పదకొండు కరెంట్ స్తంభాలను ధ్వంసం చేసి, గ్రామంలో అలజడి సృష్టించిన సంగతి విదితమే.గత రాత్రి నుండి పెదకుదమ, సిగణాపురం, చింతలబెలగాం, గదబవలస గామాలకు విద్యత్ సేవలు నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు నీటి, కరంటు కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. విద్యత్ సర్పరా పునరుద్దరించడానికి విద్యుత్ శాఖా అధికారులు గత అర్దరాత్రి నుండి అవిశ్రాంతంగా శ్రమిస్తూ మరమత్తు పనులు త్వరితగతిన చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ ఏనుగుల వలన మా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని, మా గ్రామానికి చెందిన వ్యక్తిని పొలం పని చేస్తుండగా పొలంలో తొక్కి గతంలో చంపేసాయని తెలిపారు. అలాగే కొన్ని నెలల క్రితం మా వీధిలో వృద్దురాలు పొలంలో గొర్రెలు మేపుతుండగా ఆమెపై దాఢి చేయగా కాలు , చేయి విరిగి పోయి మంచం పట్టి లేవలేని స్దితిలో ఉందన్నారు.
ముఖ్యమంత్రి స్పీచ్‌లో పసలేదు.. బీఆర్ఎస్‌కు బస లేదు
సీఎం కేసీఆర్ స్పీచ్‌లో పసలేదు.. బీఆర్ఎస్‌కు బస లేదు అని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు బుర్ర నర్సయ్య గౌడ్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తాజాగా ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతూ.. అవినీతికి పరాకాష్టగా కేసీఆర్ ప్రభుత్వమన్నారు. ఖమ్మం సభ ఖర్చు 300కోట్లు, ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడికి కట్టబెట్టిన భూమి కమిషన్ తో పెట్టిన సభ అది అని ఆయన వ్యాఖ్యానించారు. కార్లమార్స్ సిద్ధాంతం సైతం అమ్ముకున్న కమ్యూనిస్ట్ నాయకులు అని ఆయన ఆరోపించారు. 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు బర్గర్లకు పొంతన ఏముందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించడం ప్రజలకు ఇచ్చిన వాగ్దాలను కప్పిపుచ్చుకునేందుకే పార్టీ ఏర్పాటు చేశాడన్నారు. కమ్యూనిస్టులు దిగజారి బీఆర్‌ఎస్‌తో పొత్తు కేవలం స్వలాభం కోసమేనని ఆయన విమర్శించారు.
రెండు దశాబ్దాల అనుబంధం.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లేఆఫ్
ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఏకంగా 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే తొలగింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయ ఉద్యోగి ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థతో 21 ఏళ్ల అనుబంధాన్ని ముగించాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ గా లింక్డ్‌ఇన్ లో పోస్టు పెట్టాడు. ప్రశాంత్ కమానీ అనే ఉద్యోగి తన తొలగింపు తనను తీవ్రంగా దెబ్బతీసిందని వార్తను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నాడు. కమాని మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉన్నారు. తాజాగా తొలగింపులో ఇతడి పేరు కూడా ఉంది.
పనిలేదు.. ఊళ్ళకు ఊళ్లు వలసలు..ఎక్కడంటే?
ఊళ్ళు, గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. కానీ ఊళ్ళకు ఊళ్ళు వలసపోతున్నారు. కన్న తల్లిని, ఉన్న ఊరుని వదలకూడదంటారు. కానీ ఆజిల్లాలో మాత్రం వలసలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఊరివాసులు పిల్లాపాపలతో వలస బాట పట్టారు. కోసిగి, కౌతాలం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల్లో పల్లె ప్రజలు పట్టణాలకచ వలసలు వెళ్తున్నారు. కోసిగి మండలంలో ఒక్కరోజే దాదాపు 10 వేల మంది వరకు పసి పిల్లలతో కలిసి వలస బాట పట్టారు. కోసిగి మండలం , అర్లబండ, సజ్జలగూడం, కందుకూరు, నుంచి వలస బాట పడ్డారు. మంత్రాలయం మండలం నుంచి దాదాపు 800 మంది పెట్టేబేడా సర్దేశారు.జిల్లాలోని కౌతాలం మండలం నుంచి 200 కుటుంబాలు, పెద్దకడుబూరు మండలం నుంచి 20 కుటుంబాలు గుంటూరు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రకు వలసలు వెళ్తున్నారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపలతో వలస బాట పట్టడంతో పలు కాలనీలు జనం లేక నిర్మానుష్యంగా మారాయి. కేవలం వృద్ధులు మాత్రం ఇళ్లు దగ్గర ఉండటం విశేషం. కొంతమంది వృద్ధులు దగ్గర పసి పిల్లలను వదిలి వెళ్లారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనులు బిల్లులు రాకపోవడంతో వలసలు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరనుకుంటున్నారు.. పుష్ప రాజ్ బిడ్డ.. తగ్గేదిలే
అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చరిష్మా.. అల్లు స్నేహారెడ్డి అందం పుణికిపుచ్చుకొని పుట్టిన కుందనపు బొమ్మ అల్లు అర్హ. ఆమె పుట్టడం నుంచే సెలబ్రిటీ హోదాను సంపాదించుకొంది. నిజం చెప్పాలంటే అర్హ కు ఉన్నంత ఫ్యాన్స్.. అర్హ అన్న అయాన్ కు లేదు అంటే అతిశయోక్తి కాదు. బన్నీతో కలిసి ముద్దు ముద్దు మాటలు చెప్తూ అల్లు అభిమానులను ఫిదా చేసింది. ఒక దోస స్టెప్ నుంచి ఈ మధ్య వచ్చిన కందిరీగల కథల వరకు అల్లు అర్హ చిట్టి చిట్టి పలుకుల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అర్హ ఎంతో తెలివైన అమ్మాయి అని అల్లు అరవింద్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి చూస్తే ఇట్టే నేర్చేసుకుంటుందట. అవును.. ఎంతైనా పుష్ప రాజ్ బిడ్డ కదా.. నటన అర్హ రక్తంలోనే ఉంది. అందుకే అర్హ 6 ఏళ్లకే వెండితెరపైకి వచ్చేసింది.
ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ మానేశా.. అనూ ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తోంది. ఇక జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ గతేడాది జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసింది. అందుకు కారణంగా.. సినిమాల వలన జబర్దస్త్ కు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని, జబర్దస్త్ లో కొన్ని మాటలను తాను తీసుకోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక బయటికి వచ్చాకా కూడా అమ్మడు చాలానే విమర్శలు ఎదుర్కొంది. మొన్నీమధ్యనే ఆంటీ వివాదం ముగిసింది. తనను ఆంటీ అమ్మవారిపై కేసు పెట్టి.. వాళ్ళపై లీగల్ చర్యలు తీసుకున్న అనసూయ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. జబర్దస్త్ కు ఆ ఇద్దరి వలనే గుడ్ బై చెప్పాను అని షాక్ ఇచ్చింది.