ఖమ్మం బీఆర్ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యింది
బండి సంజయ్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బండిని ఎప్పుడో మరచిపోయారని ఎద్దేవ చేశారు. ఖమ్మం సభను వచ్చిన జనం చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందని అన్నారు. కంటి చూపు చూసేంత జనం వచ్చారని అన్నారు. బహిరంగ సభలు బీజేపీకి తెలియదన్న ఆయన బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? ఏం చేయబోతున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ ను తిట్టడం పనిగా పెట్టుకుంటే ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకు గల్లీలో పెట్టె ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారు? అని కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్ లో దేశంలో ఎక్కడ ఏ సభ జరిగిన ఇట్లాగే ఉంటుందని చురకలంటించారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని వ్యాఖ్యానించారు.
అదే జరిగితే అణు యుద్ధం తప్పదు
రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధం అణు యుద్ధంగా మారతుందని ప్రపంచం మొత్తం ఆందోళనలు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉంటే రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ కు అత్యంత సన్నిహితుడు డెమిత్రి మెద్వదేవ్ మరోసారి అణుహెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే అణుయుద్ధం తప్పదని అన్నారు. సాంప్రాదాయ యుద్దంలో అణుశక్తిని ఓడిస్తే అణుయుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఆయన టెలిగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.
పోలీసులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు తగవు
పోలీసుల్ని బెదిరించేలా రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికింది ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం. పోలీసులపట్ల మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంఘం మండిపడింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను హోం మంత్రిని కావాలని కోరుకుంటున్నానన్నారు. అలా హోం మంత్రి అయితే పోలీసులపై షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసుల సంగతి తేలుస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేశారని, ఇది ఎంతమాత్రం తగదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ అయ్యన్నపాత్రుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గతంలో బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేసి ప్రజాస్వామ్యంలో ఉంటూ పోలీసుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఇటువంటి బాధ్యత లేని ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తులు గతంలో మంత్రి పదవులు నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని అభిప్రాయపడుతున్నాం అన్నారు.
నాలుగో భార్యకు ట్రిఫుల్ తలాక్… కేసు నమోదు
కేంద్ర ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని ధిక్కరించి తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇస్తున్నారు. ఇలాంటివి దేశంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఇప్పుడు ఆ భార్య న్యాయం కోసం పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే తన నాలుగో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు రాజస్థాన్ కు చెందిన 32ఏళ్ల ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్ ఇండోరో పోలీసులు వెల్లడించారు. ఇద్దరు మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఇమ్రాన్ కు అప్పటికే ముగ్గురు భార్యలు ఉన్నారని నాలుగో భార్య తెలుసుకుంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో రాజస్థాన్ లో ఉన్న ఇమ్రాన్ నాలుగో భార్యకు ‘‘ తలాక్, తలాక్, తలాక్’’ అంటూ టెక్ట్స్ మెసేజ్ పంపి వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం తక్షణ ‘ట్రిపుల్ తలాక్’ ఆచారాన్ని నిషేధిస్తుంది. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తుంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇమ్రాన్ పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు పంచాయతీ అధికారులకు జైలుశిక్ష
ఏపీలో ఇద్దరు జిల్లా పంచాయతి అధికారులకు జైలుశిక్ష విధించింది హైకోర్టు. జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణంపై గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు. స్టే ఉన్నా ఈవో ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చెయ్యడంతో సూమోటోగా కోర్టుధిక్కార కేసు నమోదుచేశారు. గతంలో కర్నూలు జిల్లా డీపీవో గా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకరరావుకు వారం రోజులు జైలు శిక్ష, 2 వేలు జరిమానా విధించింది. చిత్తూరు జిల్లా పంచాయితీ అధికారి దశరధ రామిరెడ్డికి 15 రోజులు జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించింది హైకోర్ట్. తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేస్తూ అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది హైకోర్టు. ఇదిలా ఉంటే సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖరరెడ్డి నియామకంపై విచారణ జరిగింది. నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామన్నారు ఏజీ. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిసారు అడ్వకేట్ జనరల్. మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు తెలిపారు ఏజీ. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అంది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమంది హైకోర్టు.
ఫోన్‌పేలో రోజుకో రూపాయి.. ఆపై బ్లాక్‌మెయిల్..
వాళ్లిద్దరు ముందు ప్రేమికులు. కానీ.. అబ్బాయి వికృతచేష్టలు నచ్చక అతడ్ని ఆ అమ్మాయి దూరం పెట్టింది. బ్రేకప్ కూడా చెప్పేసింది. కానీ.. అతడు మాత్రం ‘వదలా బొమ్మాళి నిన్నొదలా’ అంటూ వెంటపడ్డాడు. దాంతో ఆ యువతి అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో అతడ్ని బ్లాక్ చేసింది. అయితే.. అతడు తెలివిగా ఫోన్‌పేలో చాట్ చేయడం మొదలుపెట్టాడు. రోజుకో రూపాయి పంపుతూ వేధించసాగాడు. చివరగా బెదిరింపులకు దిగడంతో.. ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు అతడు కటకటాలవెనుక మగ్గుతున్నాడు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..న్యూబోయిన్‌పల్లికి చెందిన యువతి (25) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఈమె మాజీ ప్రియుడు మిహిర్ గణత్ర (26) కూడా ఒక ప్రైవేటు ఉద్యోగే. వీరి మధ్య చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. మొదట్లో వీరి ప్రేమాయణం సజావుగానే సాగింది. కానీ.. కాలక్రమంలో అబ్బాయిలో మార్పు వచ్చింది. 2019 నుంచి యువతిని గణత్ర అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఆమెను అవమానించాడు. అంతటితో ఆగకుండా చెయ్యి కూడా చేసుకునేవాడు. దాంతో.. విసుగుచెందిన ఆ యువతి, అతడ్ని దూరం పెట్టింది. ఇకపై తనని కాంటాక్ట్ చేయొద్దని.. నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. మళ్లీ అతడు తనని తిరిగి కాంటాక్ట్ చేయకుండా ఉండేందుకు.. సోషల్ మీడియా ఖాతాలన్నింటిలోనూ బ్లాక్ చేసింది.
నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావెద్
నటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో చాలా పాపులర్. సెమీ న్యూడ్ వస్త్రాలతో బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఈ బొమ్మ తరచూ తన వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలె బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలంగా, అసభ్యతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలపై ఉర్పీ జావెద్‌పై ముంబైకి చెందిన న్యాయవాది కేసు నమోదు చేశారు. అసభ్యకరంగా దుస్తులు వేసుకొని పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేస్తున్నారంటూ బాంద్రా పోలీసులకు న్యాయవాది అలీ ఖాషిఫ్ ఖాన్ దేశ్‌ముక్ అంధేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉర్పీ జావెద్ మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా తేలికగా తీసుకున్నారు. కేసు నమోదు తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. నాపై ఇంకా ఎన్ని కేసులు పెడుతారు. నన్ను రేప్ చేస్తామని, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నా దుస్తులు, నా వస్త్రధారణ గురించి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నా వస్త్రధారణపై ఉన్న అభ్యంతరం.. మగవాళ్లు నాపై బలత్కారం చేస్తానని బెదిరించడంపై ఎందుకు లేదు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు అని ఉర్ఫీ జావెద్ ప్రశ్నించారు.
స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులను కలువరపరుస్తున్నాయి. మొన్నటివరకు ప్రముఖులు మృతి వార్తలు విని గుండెలు అవిసేలా బాధపడ్డాం.. ఇక ఈ ఏడాది ప్రముఖుల కుటుంబ సభ్యుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. నిన్నటికి నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె తండ్రి లక్ష్మి నారాయణ కన్నుమూయగా.. నేడు కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు తల్లి మృతి చెందారు. వడివేలు తల్లి సరోజినీ గత కొన్ని రోజులుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మధురై సమీపంలోని విరగానూర్ గ్రామంలో నివసిస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొన్నిరోజుల ముంచు ఆమె మధురైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక చికిత్స తీసుకుంటూనే గతరాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న వడివేలు వెంటనే షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి సొంత ఊరుకు పయనమయ్యారు. వడివేలు తల్లి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక వడివేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో బ్రహ్మానందం ఎలానో.. తమిళ్ లో వడివేలు అలా.. ఆయన లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. డబ్బింగ్ సినిమాలతో వడివేలు తెలుగువారికి కూడా సుపరిచితమే.