ఇంట్లో ఖరీదైన కార్లు.. చేసేది భిక్షాటన.. మోసపోయిన డాక్టర్

పాకిస్తాన్ లో ఇప్పుడో యువతి వీడియో తెగవైరల్ అవుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన పాకిస్థానీ అమ్మాయి షాజీయా ఎలా మోసపోయిందనే వీడియోని ఫిబ్రవరి 20న సయ్యద్ బాసిత్ అలీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ చాలా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి మోసపోయిన తీరును చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంపోర్ట్-ఎక్పోర్ట్ వ్యాపారం అని చెప్పుకున్న ఓ కుటుంబంలోకి డాక్టర్ అయిన షాజియా కోడలుగా వెళ్లింది. తీరా ఐదారు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. తన బాధను షాజియా వివరించింది. లాహోర్ లోని సంపన్నులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో తన కుటుంబం ఉండేదని చెప్పింది. నా పెళ్లిని నా కుటుంబం నిర్ణయించిందని, మొదటి 4-5 నెలలు అద్భుతంగా గడిచాయని, నేను ఏ పనిచేయాల్సిన పని లేదని, జీవితాన్ని ఆస్వాదించమని అత్తమామలు చెప్పారని షాజియా వెల్లడించింది. తాను విలాసవంతంగా జీవించినట్లు తెలిపింది. ఇంట్లో జిమ్, స్మిమ్మింగ్ ఫూల్, ల్యాండర్ క్రూయిజర్, ఫార్చ్యూనర్ కార్లు, పని వాళ్లు ఇలా అంతా చూస్తే ధనిక కుటుంబం లాగే ఉండేదని చెప్పింది.
జోగేశ్వరరావుది ఉనికి కోసం చేస్తున్న హడావిడి

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల ఉద్దేశపరంగానే చర్చ కోసం మైక్ ప్రకటన చేసారు ..బహిరంగ చర్చ కోసం పోలీసులకు తెలిస్తే ఊరుకుంటారా…టిడ్కో ఇళ్లు నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతి చేసి నిర్వీర్యం చేసారు. లబ్ధి దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు… ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాము…అప్పట్లో ఈ ఇల్లు నిర్మాణం ప్రైవేట్ కాంట్రాక్టర్ తో చేయించుకోవడం కోసం చంద్రబాబునాయుడుని కలిసాము..సౌకర్యవంతంగా అతి తక్కువ రేట్ కి చేసేందుకు స్కెచ్ తో సహా సిద్దం చేశాను. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. కలిసిన దాంట్లో జోగేశ్వరరావు లేడు అని చెప్పమనండి. కాలాపువ్వు సెంటర్లో జోగేశ్వరరావు కాళ్ళు మధ్యలో నుంచి దూరిపోతాను. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఆనాడు టిడ్కో ఇల్లు నిర్మాణం చేశారు..ప్రస్తుతం సీఎం జగన్ ఇల్లు సౌకర్యవంతంగా నిర్మాణం చేస్తున్నారు…తన ఉనికి చాటు కోవడం కోసమే జోగేశ్వరరావు హడావుడి చేస్తున్నాడు..అతను ఉలిక్కి పడుతున్నాడు..భయం తోనే ఆర్భాటం చేస్తున్నాడు..చర్చ కోసం జనాన్ని పిలుచుకోవడం ఎందుకు అన్నారు. ఇది బలప్రదర్శన కాదు..నేను ఒక్కడినే వస్తాను. నిజంగానే టిడ్కో ఇళ్లలో రాత్రి పడుకోవాలంటే కమిషనర్ ని అడగవలసిన అవసరం ఏముందన్నారు తోట త్రిమూర్తులు.
లోకేష్ తీరు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుంది

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని PLR కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ , భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉంది..లోకేష్ తన స్ధాయికి నుంచి మాట్లాడుతున్నాడు..ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడు… లోకేష్ కూడా అదే కావాలని కోరుకున్నట్లు ఉంది. మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరగగలడా? చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయండి…లోకేష్ ఒక పిల్ల పిత్రేగాడు…మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు…దమ్ముంటే ఆధారాలతో రా లోకేష్ ..నీ పాదయాత్రకు జనాలు లేరు…కనీసం పదిమంది కూడా ఉండడం లేదు.. చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ చార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్ళది అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. లోకేష్ నావల్ల కాదని జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నాడు.
హడలెత్తిస్తున్న వరుస చైన్ స్నాచింగ్ లు

Chain Snacher
హైదరాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి తెస్తూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని నిఘాలు పెట్టినా దొరకకుండా పట్టుకోండి చూద్దాం అన్నట్లు సవాల్ చేస్తున్నారు. తాజాగా నగరంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే చైన్ స్నాచింగ్ జరిగింది. గోకుల్ నగర్ బస్తీలో విజయ్ కుమారి అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు ఆమెపై దాడికి పాల్పడి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు దొంగలించి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా గోకుల్ నగరంలో కలకలం రేపుతోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎలా వచ్చాడు..ఎలా వెళ్లాడు.. అనేది సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్ని ప్రత్యేక టీమ్‌లు పెట్టినా కానీ దుండగుల చైన్ స్నాచింగ్ మాత్రం ఆగడం లేదు.
లిక్కర్ కేసులో సీబీఐ విచారణ.. మనీష్ సిసోడియా “జైల్” ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో నమోదు అయిన ఛార్జీషీట్ లో సిసోడియా పేరు కూడా ఉంది. అయితే గత ఆదివారమే సీబీఐ ముందు సిసోడియా హాజరుకావాాల్సి ఉన్నా, విచారణకు మరింత సమయం కోరారు. తాను బడ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని అందుకే మరింత గడువు కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొన్ని గంటల్లో సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీనికి ముందు సిసోడియా జైలు జీవితంపై ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు మళ్లీ సీబీఐకి వెళ్తే విచారణకు పూర్తిగా సహకరిస్తా.. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు నా వెంట ఉన్నాయి.. కొన్ని నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చినా పట్టించుకోను.. భగత్ సింగ్ అనుచరుడు, దేశం కోసం భగత్ సింగ్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం పెద్ద విషయం కాదు’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
యుద్ధ వాతావరణం తెచ్చిన ప్రభుత్వం.. కూలీలను అరెస్ట్ చేస్తున్నారు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. కాల్పుల్లో ఓ ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ ప్రెస్ నోట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాగర్‌గూడ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ దాడి పై బస్తర్ మొత్తాన్ని పోలీసు క్యాంపుగా ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. నాలుగు నెలల్లో మొత్తం తొమ్మిది క్యాంపులు తెరిచి ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారన్నారు. అత్యాధునిక సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు, నిఘా విమానాల సహాయంతో ఆ ప్రాంతాన్ని పర్యావేక్షిస్తున్నారు. మినపా క్యాంపుతో సహా ఇతర పోలీస్ స్టేషన్లు, శిబిరాల్లో కాల్పులు, బాంబు దాడులకు రిహార్సల్ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక దాడులను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు మిర్చి, కూలీ కోసం వెళ్తున్న కూలీలను కూడా మావోయిస్టు నేపథ్యంలో అరెస్టు చేస్తున్నారంటూ గంగ ఆరోపించారు .
ఆడియన్స్ ని గ్రాండ్ ఫైనలేలా చేశారు

తెలుగు ఒటీటీ ‘ఆహా’లో సూపర్ సక్సస్ అయిన షోల్లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. తమన్, నిత్య మీనన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ ప్యానెల్ లో ఉంది ఈ షో సీజన్ 1ని సూపర్ సక్సస్ చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేశారు. మార్చ్ 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకి ప్రీమియర్ కానున్న ఈ షోలో నిత్యమీనన్ ప్లేస్ లో గీత మాధురి జడ్జ్ గా వచ్చింది. సింగర్ హేమచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటివలే షో రన్నర్స్ ఆడిషన్స్ ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ వీక్ లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లాంచ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ప్రోమో చూస్తేనే సీజన్ ఫైనలే లాగా ఉంది అంటూ గీత మధురి తన ఫీలింగ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేసింది. మంచి సింగర్స్, మంచి సాంగ్స్, తమన్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్… గ్యారెంటీడ్ ఫన్ ఇవ్వనున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం తెలుగు రాష్ట్రాల్లోని సంగీత ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి వారి వైటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సీజన్ 2 ఫిస్ట్ ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి.
రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది

అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు. ఆ షెడ్యూల్ షూటింగ్ సమయంలో సారధి స్టూడియోలో కార్లు పేలిస్తే, అవి మైత్రివనం వరకూ కనిపించాయి… త్రివిక్రమ్ ఈసారి బాబుతో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటి అనే కామెంట్స్ తో సోషల్ మీడియాలో లీక్డ్ వీడియోలు, ఫోటోలు కనిపించాయి. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రావడంతో త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యనున్నాడు.