జెనీవా అసెంబ్లీకి పోటీలో శ్రీపాద ఫణిశాస్త్రి

విదేశాల్లో ఉంటున్న మన భారతీయులు మన ఖ్యాతిని చాటిచెబుతున్నారు. ఎంతోమంది ఎన్నారైలు వివిధ దేశాల్లో వివిధ పదవులకు పోటీపడుతూ.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా శ్రీపాద ఫణిశాస్త్రి ఇటు ఆంధ్రప్రదేశ్, భారత్ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన శ్రీపాద ఫణి శాస్త్రి జెనీవా అసెంబ్లీకి పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. స్విట్జర్లాండ్ లోని జెనీవా స్టేట్ గ్రాండ్ కౌన్సిల్ కి (మన ఎమ్మెల్యే హోదా) శ్రీపాద ఫణి శాస్త్రి పోటీ చేస్తున్నారు. ఆ దేశంలో ఎన్నికల బరిలో నిలిచిన మొట్ట మొదటి భారతీయుడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు ఫణిశాస్త్రి.ఏప్రిల్ 2వ తేదిన పోలింగ్ జరగనుంది. వంద స్థానాలు ఉన్న జెనీవా అసెంబ్లీకి 690 మంది పోటీ చేస్తున్నారు. బరిలో దిగిన మొత్తం 12 పార్టీల అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జెనీవాలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన గ్రీన్ పార్టీ తరఫున రంగంలో నిలిచారు ఫణి శాస్త్రి. ఆయన మొత్తం 48,000 ఓట్లలో మెజారిటీ ప్రజల మద్దతు పొందవలసివుంది. అక్కడ 70 శాతం ఓటర్లు ప్రవాసీయులే కావడం విశేషం. వీరిలో 30 శాతం పైగా పోర్చుగల్ దేశస్థులు ఉన్నారు. భారతీయ ఓటర్లు మాత్రమే 2,500 మంది ఉన్నారు. స్విట్జర్లాండ్ లో 165 దేశాలకు చెందిన ప్రవాసీయులు నివాసం ఉంటున్నారు. స్విట్జర్లాండ్ పేరుచెబితే అదో మినీ వరల్డ్ లా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఏజన్సీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు ఫణి శాస్త్రి. గత 20 సంవత్సరాలుగా స్విట్జర్లాండ్ లో నివాసం ఉంటున్నారు ఫణి. ప్రవాసీయుల సంక్షేమం, ప్రయోజనాల పరిరక్షణ ప్రధాన అజెండాగా ఫణి విభిన్న శైలిలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జెనీవా అసెంబ్లీకి ఎన్నికై భారతీయ ఖ్యాతిని పెంచాలని మనమూ ఆశిద్దాం. బెస్టాఫ్ లక్ ఫణి శాస్త్రి.
మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్. ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
తిరుపతి జిల్లా చిందేడులో ఉద్రిక్తత

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈసీఎల్ పరిశ్రమ కోసం రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ ను వ్యతిరేకిస్తున్న్నారు చిందేపల్లి గ్రామస్తులు… గ్రామస్తులకు అండగా నిలబడ్డారు శ్రీకాళహస్తి జనసేన నేతలు.
అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తొలగించడానికి జనసేన ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లాఠీలతో గ్రామస్తులను చెదరగొట్టి, జనసేన నేతలను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్ళారు పోలీసులు. దీంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫుల్‌గా తాగాడు.. ఫోన్ చేసి సీఎం ఇంటినే పేల్చేస్తా అన్నాడు

హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్‌లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు. ఈ కేసులో అరెస్టయిన అంకిత్ కుమార్ అనే యువకుడిని పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు. విచారణ, దర్యాప్తులో నిందితుడికి వ్యతిరేకంగా ఖచ్చితమైన క్రిమినల్ ఆధారాలు లభించకపోవడంతో కాబట్టి పోలీసులు అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.పాట్నాలోని సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు మద్యం మత్తులో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. విచారణలో అతనికి ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని తేలింది. వైశాలి జిల్లా లాల్‌గంజ్‌కు చెందిన అంకిత్ గుజరాత్‌లోని సూరత్‌లో పనిచేస్తున్నాడు. రోజూ మద్యం సేవించేవాడు. హోలీ సందర్భంగా గుజరాత్ నుండి తన గ్రామానికి చేరుకున్న అతను మద్యం సేవించకూడదని తెలుసుకున్నాడు. అలా నిషేధం విధించినందుకు ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.గుజరాత్‌కు వెళ్లిన తర్వాత.. అక్కడ బాగా మద్యం సేవించి.. గూగుల్ నుంచి ఓ న్యూస్ ఛానెల్ ఫోన్ నంబర్‌ను రాబట్టినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. మద్యం మత్తులో వాడు ఏం మాట్లాడాడో తెలీదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నివాసంపై బాంబు పేలుళ్ల కథనం ఆయన నోటి వెంట వచ్చింది. ఈ కేసులో అతడిని అదుపులోకి తీసుకుని గుజరాత్ పోలీసులు విచారించగా.. అంకిత్ ఎంత పెద్ద నేరం చేశాడో అర్థం కాలేదు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. అతని స్వగ్రామం, నేర చరిత్ర గురించి ఆరా తీశారు.
చంద్రాపూర్, మంచిర్యాలల్లో పులుల మరణాలు.. ముగ్గురి అరెస్ట్

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు పులులు మరణించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగంపేట శివారులో పాతిపెట్టిన పులి కళేబరాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. పులి గోరు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పులిని హత్య చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. 2018-19 మధ్య కాలంలో విద్యుత్ వైర్లు తగిలి పులి మరణించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. చనిపోయిన పులి వయస్సు ఎంత..? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ జరగుతోందని అటవీ శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో మరో పులి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగర్ గాం శివారులో తాడోబా అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని అధికారులు గుర్తించారు. మగపులి చనిపోయి 8, 9 రోజులు అయిందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పులి ఎలా మరణించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, తెలంగాణల మధ్య పులుల సంచారం ఎక్కువ అయింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని పులులు వస్తూపోతూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులులు కదలికలు పెరిగాయి. ఈ రెండు అభయారణ్యాల మధ్య పులులు ఓ కారిడార్ ను ఏర్పరుచుకున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం పులుల కదలికతో వణికిపోతున్నారు.
లోన్ యాప్ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు
లోన్ యాప్ పేరిటి మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో వెలుగు చూస్తున్న మోసాలు ఇప్పుడు జిల్లాలకు పాకింది. లోన్ మంజూరు అయ్యిందంటూ ఫోన్ చేయడం వారి ఖాతాలో వున్న డబ్బులను ఖాలీ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అయితే.. చేసే మోసం ఒకటే కాని మార్గం వేరుంటుంది. తెలివైన వాళ్లు కూడా అప్పుడప్పుడూ ఇలాంటి కొత్త మోసాలకు, కొత్త అవతారం ఎత్తుతున్న మోసగాళ్లకు చిక్కి సర్వం కోల్పోతుంటారు. తాజాగా ఇలాంటి మోసాలు జిల్లాలో చెలరేగుతున్నాయి. లోన్ యాప్ ఇస్తామంటూ మీ లోన్ ఒకే అయ్యింది అంటూ కాల్ చేసి బ్యాంక్ లో వున్న డబ్బులు సైతం ఖాలీ చేస్తున్నారు కేటు గాల్లు. దీంతో లబోదిబో మంటున్నారు బాధితులు. ఇలాంటి ఘటనే సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకుంది.
దశాబ్ధాల కాశ్మీర్ ప్రజల కల.. ప్రారంభానికి సిద్ధం అవుతున్న చీనాబ్ వంతెన

రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నదిపై ఈ వంతెనను నిర్మించింది భారత ప్రభుత్వం. ఇది కట్రా, బనిహాల్ మధ్య కీలకమైన లింక్ గా ఉంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా(యఎస్బీఆర్ఎల్) రైల్వే లింకులో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టును రూ. 30,000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1400 కోట్లతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అన్ని సేఫ్టీ పరీక్షల్లో వంతెన పాస్ అయింది. 2003లో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు రెండు దశాబ్ధాల కాశ్మీరీ ప్రజల కల. అయితే అక్కడి పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. చివరకు 2008లో అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణ కాంట్రాక్టులను ఓకే చేసింది.
CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్

మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రత్యేకమైనది. మూడు సంవత్సరాల తర్వాత, చెన్నై అభిమానులు తమ అభిమాన జట్టును చెపాక్‌లో చూడగలరు. ఇది సీఎస్కే కెప్టెన్ MS ధోనీకి చివరిది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా CSK పటిష్టమైన జట్లను కూడా ఓడించింది. లీగ్‌లో నాలుగుసార్లు గెలిచిన వారి విజయమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అయినప్పటికీ, ధోనీ టీమ్ కి వయసు భారం పడుతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నారు. ఇది CSK పతనానికి నాంది పలకబోతుందా? అని మాథ్యూ హేడెన్ అన్నారు. MS ధోని నేతృత్వంలోని డాడీస్ సైన్యంకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వారులో కొంత మందిపై వయసు భారం పైన పడుతుంది. సీఎస్కే ఇప్పుడు ఒక రకమైన తండ్రి సైన్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హేడెన్ స్టార్ స్పోర్ట్స్‌కి చెప్పారు. ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు ఇంచుమించు ఒకే వయసులో ఉన్నారు.. అక్కడ వారు జట్టుకు నాయకులుగా మాత్రమే కాకుండా, నిజంగా కీలక ఆటగాళ్లుగా ఉండాల్సిన అవసరం ఉంది.. కాబట్టి ముఖ్యంగా ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లు, వారి వయస్సుతో అది సాధ్యమవుతుందా అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ అన్నారు.