ఏయ్ బిడ్డా… 2024 వరకూ నడ్దాదే బీజేపీ అడ్డా
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా(జేపీనడ్డా) పదవీ కాలాన్ని పొడగిస్తూ బీజేపీ జాతీయకార్యవర్గ సమాావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. జూన్,2024 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొగడిస్తున్నట్లు కేంద్రహోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2024 లోక్ సభ ఎన్నికలు జేపీ నడ్డా అధ్యక్షతనే జరుగుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. నడ్డా నేతృత్వంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ బలపడిందని అమిత్ షా అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీనే అని ఆయన అన్నారు. బీహార్, మహారాష్ట్రలో బీజేపీ బలపడిందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాము బలపడ్డామని, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల్లో గెలుపొందామని, గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చామని, గుజరాత్ లో రికార్డ్ స్థాయిలో విజయం సాధించామని అమిత్ షా అన్నారు.
ఆలీ సంచలన ప్రకటన.. పవన్ పై పోటీకి రెడీ
సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ సంచలన ప్రకటన చేశారు.. తెరపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలే కొనసాగాయి.. ఆ తర్వాత కొంత డ్యామేజ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, వైసీపీలో ఉన్న ఆలీ.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు.. నగరిలో కొండచుట్టు ఉత్సవం సందర్బంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు.. పార్టీ ఆదేశాలు చేస్తే పవన్‌పై నిలబడ్డానికి నేను సిద్ధం అన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 స్థానాలకు.. 175 స్థానాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రానున్న ఎన్నికల్లో వందకు వందశాతం వైసీపీ గెలుస్తుందన్నారు. ఇక, మరోసారి రోజా కూడా విజయం సాధిస్తుందన్నారు.. మంత్రి రోజాపై పవన్ కల్యాణ్.. డైమండ్ రాణి కామెంట్లపై స్పందించిన ఆలీ… డైమండ్ అనేది చాలా పవర్ పుల్.. చాలా విలువైనది.. రోజా కూడా తగ్గేదే లేదు.. అమె ఫైర్ బ్రాండ్.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో మంత్రి రోజాకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు..
ఒక్క ఓటుతో మేయర్ పీఠం.. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ సంచలనం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సంచలనం నమోదు అయింది. గతంలో జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నువ్వా నేనా అన్న రీతిలో పోరాడాయి. మొత్తం మున్నిపల్ కార్పొరేషన్ లో 35 కౌర్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆప్, బీజేపీ పార్టీలకు చెరో 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు, శిరోమణి అకాలీదళ్ కు ఒక కార్పొరేటర్ ఉన్నారు. మంగళవారం మేయర్ ఎన్నిక కోసం జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ ఒక్క ఓటుతో గెలుపొందింది. బీజేపీ నుంచి కొత్త మేయర్ గా అనూప్ గుప్తా ఎన్నియ్యారు. అనూప్ గుప్తాకు 15 ఓట్లు రాగా.. ఆప్ మేయర్ అభ్యర్థి జస్బీర్ సింగ్ కు 14 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ పార్టీ ఒక్క ఓటుతో మేయర్ సీటును కైవసం చేసుకుంది.
గద్దర్ సంచలనం.. బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని ప్రకటన
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరపున పలు ప్రశ్నలు వేశారు. సకల సంపదలు గల దేశంలో దరిద్రమెట్లుంది? దరిద్రం మొదటి నుండి పాలించిన పాలకులదా? ప్రజలదా? అని ప్రశ్నించారు. పాలసీలల్లో లోపం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ లో భూమి, నీరు, పని చేసేవారు ఉండగా దరిద్రమెట్లుందిని అన్నారు. ఇది నాదే కాదు ప్రజల ప్రశ్న కూడా అని అన్నారు గద్దర్. దీనిమీద సీరియస్ గా అసెంబ్లీలో చర్చ జరగాలని కోరారు. పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టడం కూడా రాజకీయాంశమే అని ఆరోపించారు. పార్లమెంటుకు పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేసి పేరు పెట్టాలని కోరారు. డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టే అని కోరారు. బీఆర్‌ఎస్ ను మేము స్వాగతిస్తున్నామని అన్నారు. నూతన సెక్రటరీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో డా. బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కూడా చేర్చాలని కోరుతున్నామన్నారు గద్దర్. అయితే.. పార్లమెంట్ కు ఆయన పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేయాలన్నారు. ఇక.. అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టేనని అభిప్రాయపడ్డారు.
నరేష్ పవిత్రల పెళ్లిపై రమ్య హాట్ కామెంట్స్
సీనియర్ జంట నరేష్- పవిత్ర పెళ్లి వార్త.. సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. అందుకు కారణం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆమె నరేష్ తో తనకు విడాకులు వద్దు అని పోరాడుతూ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ నరేష్ బండారాన్ని బయటపెడుతోంది. అసలు నరేష్ ను పవిత్ర ఏమి చూసి ఇష్టపడింది.. ఎందుకు వీరిద్దరూ ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు.రమ్య ఎందుకు ఇంకా విడాకులు ఇవ్వకుండా ఉంది.. ప్రస్తుతం అభిమానుల మనస్సులో మెదులుతున్న ప్రశ్నలు.. వీటన్నింటికి రమ్య సమాధానం చెప్పుకొచ్చింది. నరేష్ ను తన వెంట రెండేళ్లు తిరిగి పెళ్లి చేసుకున్నాడని, తానూ కూడా అతడ్ని ప్రేమించి ఇంట్లోవాళ్ళు కాదన్నా వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. నరేష్ కు ఇప్పటివరకు చాలా ఎఫైర్లు ఉన్నాయని, అవి తనకు కూడా తెలుసనీ చెప్పిన రమ్య.. ఆ విషయం తెలిసి అతడిని అడిగినప్పటి నుంచి రెండు నెలలు తనతో ప్రేమగా ఉంటాడని, ఇక ఆ విషయం మర్చిపోయిన వెంటనే మళ్లీ మొదలుపెడతాడని చెప్పుకొచ్చింది. ఇక నరేష్- పవిత్ర సమ్మోహనం సినిమా ద్వారా పరిచయమయ్యారట.. ఆమెను డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. నేను కూడా పవిత్రను ఎంతో ఆప్యాయంగా పలకరించి అన్ని మర్యాదలు చేశాను. ఆ తరువాత కొన్ని రోజులకు ఒక ప్రైవేట్ పార్టీకి వీరిద్దరూ వెళ్లినట్లు తెలిసి అనుమానం వచ్చి నరేష్ ను అడిగాను. అప్పుడు అదేం లేదని, నాలుగు రోజులు నాతో మంచిగా ఉన్నాడు. ఆ తరువాత నేను పట్టించుకోలేదు. అప్పుడే నరేష్- పవిత్ర దగ్గరయ్యారు. నరేష్ దగ్గర డబ్బు ఉంది.
యూపీలో బృందావన్ టెంపుల్ కారిడార్ రచ్చ
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలోని బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయం చుట్టూ కారిడార్ నిర్మించాలన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత రెండు రోజలు నుంచి మార్కెట్ మూసేశారు. పూజారులు కూడా స్థానికులకు మద్దతు పలుకుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు కూడా చేరింది, దీనిపై విచారణ కూడా జరుపుతోంది. ఈ నెలాఖరులో సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ జరపనుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం చుట్టూ కారిడార్ కోసం ఐదెకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక వేళ కారిడార్ నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న 300 నివాస భవనాలను కూల్చేయాల్సి ఉంటుంది. వందల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న ప్రజలు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు. 2022 డిసెంబర్ 20న అలహాబాద్ హైకోర్టు కారిడార్ కోసం సర్వే చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తన సర్వే రిపోర్టును ఈ రోజు హైకోర్టుకు సమర్పించింది.
ఈ ఇల్లు మడతపెట్టి తీసుకెళ్ళిపోవచ్చు
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఓ కల. ఎన్ని కష్టాలు ఉన్నా సొంత ఇంట్లో ఉంటే ఆ ధైర్యం వేరు. తినడానికి టైంకు ఆహారం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ సొంతిల్లు ఉండాల్సిందే. అందుకే అందరూ ఎన్నో ఏళ్లు కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇంటికోసం ఎన్నో కలలు కంటారు. అందుకే ఆ ఇల్లంటే అంతలా ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిన పరిస్థితులు వస్తే వారి ప్రాణం పోతున్నట్లు భావిస్తారు. అంతలా ఇంటిలో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అప్పటి వరకు అన్నేళ్లపాటు ఆ ఇంటితో అల్లుకున్న బంధాలు, జ్ఞాపకాలను మరిచిపోవడం అంటే అంత సులభం కాదు. అలాంటి వారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే ఈ బాధ తొలగిపోతుంది. మీరు ఇల్లు మడత పెట్టి…నచ్చిన చోటికి తీసుకెళ్లి నిలబెట్టడం, ఇంట్లో గొడలు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా మార్చుకోవడం ఎప్పుడైనా చూశారా? విన్నారా? ఇప్పుడు అలాంటి మడత ఇళ్లు రాబోతున్నాయి. కోరుకున్న చోటికి సులభంగా తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవడమే ఈ ఇంటి ప్రత్యేకత. దీన్ని ఫోల్డబుల్ హౌస్ గా చెబుతారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా ఉంటుంది. చిన్న కుటుంబానికి సరిపోతుంది. దీని ధర 49,500 డాలర్లు. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.40 లక్షలు.
మంచి నీరే జీవామృతం..వాటర్ థెరపీతో ప్రయోజనాలు
మనలో చాలామంది నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. డాక్టర్లు చెబితేనో, ఇంటి దగ్గర అమ్మ కోప్పడితేనో మంచినీరు తాగుతారు… అలాఅని వారు ఏమీ తాగకుండా ఉండరు. శరీరానికి హానిచేసే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించాలి. మనం ఉదయాన్నే నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న నీరు మన దాహార్తిని తీర్చడంతో పాటు, శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజపరిచి, మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడానికి దోహదపడుతుంది. ప్రతి రోజు నీరు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగడం ఇంకా మంచిది. ఎందుకంటే రాత్రి మనం తిన్న ఆహారం అంతా జీర్ణం అయి పేగుల్లోంచి విసర్జనకు సిద్ధం అవుతుంది. ఆ సమయంలో గోరువెచ్చని నీరు తాగితే వ్యర్థ పదార్ధాలు అన్నీ కడిగివేయబడి.. సుఖ విరేచనం అవుతుంది. మనం బాత్ రూంకి వెళ్లేముందు ఇలా చేస్తే సగం ఆరోగ్య సమస్యలను నీటితో దూరం చేయవచ్చన్నమాట. స్నానం చేయడానికి కొంచెం సేపు ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ – 2 ఆడిషన్స్
తెలుగువారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విజయవంతమైన షో… తెలుగు ఇండియన్ ఐడల్! శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన సింగర్స్ కూడా కొందరు ఈ షోలో పాల్గొని, తెలుగు పాటలు పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు. ఈ షోకు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ -2 కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ షో’ ద్వారా తాజాగా ఈ విషయాన్ని తెలియచేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ లో పార్టిసిపెంట్స్ ముగ్గురు అన్ స్టాపబుల్ వేదికపై బాలకృష్ణ సినిమాల్లోని పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారే… తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ త్వరలోనే వివిధ పట్టణాలలో మొదలు కాబోతున్నాయని తెలిపారు. ఫస్ట్ సీజన్ లో పాల్గొన్న సింగర్స్ కు ఆహా సంస్థ ద్వారా పలు చిత్రాలలో పాటలు పాడే ఛాన్స్ దక్కింది. వాళ్ళు ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరో విశేషం ఏమంటే… ఈ సింగర్స్ లో కొందరు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తున్నారు. అయితే… సీజన్ 2కు వ్యాఖ్యాతగా శ్రీరామచంద్రనే వ్యవహరిస్తాడా? వేరెవరికైనా ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తెలియలేదు.