పాకాల హరనాథరావుకి సీఎం కేసీఆర్ నివాళి
తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామగారు పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.హరనాధ్ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు.
మంత్రి అమర్నాథ్ సవాల్ కు జీవీఎల్ సై
ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. MP జీవీఎల్ నరసింహారావు కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ విసిరారు. విభజన హామీలు సహా కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై జీవీఎల్ తో చర్చకు తాను సిద్ధం అన్నారు మంత్రి అమర్నాథ్. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటోడు. ఆయన బీజేపీ నాయకుడిగా వాళ్ళ పార్టీనే గుర్తించడం లేదు. 2024 తర్వాత ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు… నరసరావుపేట, విజయవాడ అయిపోయాయి ఇప్పుడు వైజాగ్ లో పోటీ అంటున్నారని మండిపడ్డారు. యూపీలో గెలిచి ఏపీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు…జగదాంబ సెంటర్లో వదిలేస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని జీవీఎల్….. నాకు ఉన్న అవగాహనపై వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసం అన్నారు. అయితే, బీజేపీ MP జీవీఎల్ నరసింహారావు మంత్రి అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో ఐటీ అభివృద్ధి వైఫల్యాలపై బహిరంగ చర్చకు నేను రెడీ…. మంత్రి రెడీ అయితే నా ఛాలెంజ్ స్వీకరించాలి. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లాంటి ఐటీ రంగాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఐటీ ఉత్పత్తిలో 15శాతం నిపుణులు ఏపీ నుంచి ఉంటే ఇక్కడ ఐటీ ఉత్పత్తి 0.1శాతం మాత్రమే అన్నారు జీవీఎల్. ఈ లెక్కలు చూసైనా ఐటీ మంత్రి తలదించుకుని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2030కి వైజాగ్ ఐటీ అభివృద్ధిని బీజేపీ నిర్ధేశించుకుంటే….. వైసిపి మంత్రి జగదాంబ సెంటర్ గురించి చర్చిస్తారు…..ఇదీ వాళ్లకు ఉన్న అవగాహన అని ఎద్దేవా చేశారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఇన్నోవేటివ్ లీడర్స్ సహా ఏ జాబితాలో చూసిన ఏపీ పేరు లేదన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
టీడీపీకి జవసత్వాలు లేవు.. జాకీలు, క్రేన్లతో లేపుతున్నారు
విజయనగరం జిల్లా రాజాం నియోకవర్గం లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసమావేశం లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ , ఎమ్మెల్యే కంబాల జోగులు.. వైసిపి సీనియర్ నేతలు టీడీపీని తూర్పారబట్టారు. టీడీపీకి జవసత్వాలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీదే అధికారంలోకి వచ్చాం అన్నారు. రుణాలు మాఫీ అంటూ చంద్రబాబు మోసం చేసాడు. ఆయన చేసిన అప్పులన్నీ తీరుస్తానని జగన్ హామీ ఇచ్చారు.. ఇచ్చిన విధంగా తీరుస్తున్నాం అన్నారు మంత్రి బొత్స. సైకిల్ పోవాలని.. చంద్రబాబు మనస్సులో మాటని దేవుడే మాట్లాడించాడు. టీడీపీ పరిస్థితి అయిపోయింది.. జవసత్వాలు లేవు . జాకీ లు, క్రేన్ లు పెట్టి లేపుతున్నారు టీడీపీని. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం మూడు రాజదానులు అంటుంటే.. చంద్రబాబు అమరావతే అంటున్నారు. రాష్ట్ర సంపద 5 లక్షల కోట్లను పట్టుకెళ్ళి అమరావతిలో చుట్టాలు బంధువులు తాబేదార్లకు కట్ట బెట్టాలనుకుంటున్నారు. సిగ్గుండాలి కదా.. కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి కి. ఉత్తరాంధ్రలో ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటున్నారు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఈసీ కొత్త విధానం.. రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్
ఎన్నికల సంఘం ఎన్ని విధానాలు, ప్రచారం నిర్వహించినా ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే నమోదవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు వచ్చే వారు ఓటింగ్ సమయంలో తమ స్వగ్రామాలకు వెళ్ళడంలేదు. దీంతో గ్రామాల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. సొంతూళ్లను విడిచి దూరంగా ఉన్న ఓటర్లకు ఈసీ గుడ్ న్యూస్ చెబుతోంది. ఇలాంటి వారికోసం ఉన్న చోటునుంచే ఓటుహక్కును వినియోగించుకునేలా రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ను అందుబాటులోకి తేనుంది. ప్రయాణ ఖర్చులు భరించి సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం కొందరికి కష్టంగా మారుతోంది. దీంతో లక్షలాదిమంది ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వస్థలాలను వదిలి బతుకు తెరువు కోసం వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసేవారికి ఓటుహక్కును వినియోగించుకోవడం గగనంగా మారడంతో దేశంలో కోట్లాదిమంది ఓటు వేయలేకపోతున్నారు.
కందుకూరు బాధితులకు చంద్రబాబు పరామర్శ
కందుకూరు ఘటనలో చనిపోయిన కార్యకర్తల మృత దేహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. కందుకూరు ఘటన లో చనిపోయిన వారి కుటుంబానికి పార్టీ తరపున రూ.15 లక్షల సాయం. నాయకులు అందిస్తున్న సహాయంతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు. చనిపోయిన ఎనిమిది మందిలో ఆరుగురు బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు. ఈఘటనపై ప్రధాని మోడీ సంతాపం తెలిపి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈ ఘటన చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చా. పిల్లల్ని చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వాళ్లను పైకి తీసుకొచ్చే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుంది. బాధిత కుటుంబ సభ్యులకు ఏ ఆధారమూ లేదన్న భయం లేకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. 40 ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్నా. చైతన్య రథంతో దేశంలోనే ఎన్టీఆర్ మొదటి సారిగా రోడ్ షో ప్రారంభించారు. తర్వాత అద్వానీ రథయాత్ర వచ్చింది. నేను కూడా పాదయాత్ర, బస్సుయాత్ర, రోడ్ షో నిర్వహించాను. అన్ని రాజకీయ పార్టీ నేతలూ చేస్తున్నారు.ఏ నాయకులు వచ్చినా పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం.. బీటెక్ విద్యార్ధిని బలవన్మరణం
హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటి పై పెట్రోల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు కు చెందిన శిరీష బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుతో పాటు జావ కోర్సులో జాయిన్ అయి గత కొన్నాళ్లుగా ఆల్విన్ కాలనీ లోని తన బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చిన్న బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఫోర్త్ ఫ్లోర్ పైకి వెళ్లింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.. శిరీష అరుపులు కేక లు వేయడం తో కింద పోర్షన్ లో అద్దెకు ఉన్న వారు పైకెళ్లి చూశారు.. అప్పటికే పూర్తిగా మంటల్లో శిరీష చిక్కుకుపోయింది. తన శరీరం చాలావరకు కాలిపోయింది. వెంటనే దుప్పటి తో అర్పేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.. 108 కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేలోపే శిరీష మృతి చెందింది. శిరీష ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తను బలవర్మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రానా తమ్ముడితో అక్కడే శోభనం జరిగింది.. కూల్చవద్దంటున్న శ్రీరెడ్డి
టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే పురుషుల్లో రాంగోపాల్ వర్మ వస్తే మహిళల్లో శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను నడిరోడ్డుకీడ్చిన ఘనత శ్రీరెడ్డిది. ఇక ఆ తరువాత నాకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేసి టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక ఈ మధ్య కొద్దిగా జోరు తగ్గించిన శ్రీరెడ్డి మరోసారి తాజాగా మరోసారి రెచ్చిపోయింది. మానిపోయిన పాత గాయాన్ని రేపి చిచ్చుపెట్టింది. ఇప్పుడిప్పుడే దగ్గుబాటి కుటుంబం ఆ అవమానం నుంచి బయటపడుతోంది. అభిరామ్ సైతం అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి దగ్గుబాటి కుటుంబాన్ని కెలికింది శ్రీరెడ్డి. అసలు విషయమేంటంటే.. నానక్ రామాగూడా దగ్గర ఉన్న రామానాయుడు స్టూడియోస్ ఉన్న విషయం తెల్సిందే. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్టూడియోస్ లో చాలా సినిమాలు షూటింగ్ ను జరుపుకున్నాయి. అయితే గత కొన్నిరోజులుగా ఈ స్టూడియోను సురేష్ బాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై శ్రీరెడ్డి స్పందించింది. ” ఆ స్టూడియోను ఎందుకు కనుమరుగు చేస్తున్నార్రా..? అందులో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ స్టూడియోలోనే నాకు, అభిరామ్ కు ఫస్ట్ నైట్ జరిగింది.. ఇప్పుడు అది కూల్చొస్తే మా జ్ఞాపకాలు ఏంకాను.. దాని కూల్చకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అదిరిపోయాయి
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య అభిమాని అయిన దర్శకుడు ‘గోపీచంద్ మలినేని’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. తనకి టైలర్ మేడ్ రోల్ లాంటి ఫ్యాక్షన్ పాత్రలో బాలకృష్ణ చాలా కాలం తర్వాత కనిపించనుండడంతో నందమూరి అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని నందమూరి అభిమానులని మరింత ఊరిస్తూ, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. బాలయ్య ఫాన్స్ కూడా తామేమి తక్కువ కాదన్నట్లు ‘ఫ్యాన్ మేడ్’ పోస్టర్స్ ని రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ‘వీర సింహా రెడ్డి’ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇటివలే ఈ మూవీ మేకింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య అద్దాలు పెట్టుకోని మాస్ లుక్ లో కనిపించిన ఫోటో ఒకటుంది. ఈ ఫోటోని నందమూరి ఫాన్స్ సూపర్బ్ గా ఎడిట్ చేసి… ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ లైన్ ని పోస్టర్ లో పెట్టారు. స్టైలిష్ ఫాంట్ లో ‘గాడ్ ఆఫ్ మాసెస్’ ట్యాగ్ కనిపించగా, బాలయ్య మాస్ గా ఉన్నాడు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని గోపీచంద్ మలినేని షేర్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలా చేశాడు.