అందాల తార, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి తన హృదయ విశాలతను చాటుకుంది. గత యేడాది కరోనా సమయంలో ఆన్ లైన్ లో ఫిట్ నెస్ కార్యక్రమాలను నిర్వహించి, తద్వారా వచ్చిన రూ. 5 కోట్లను కరోనా బాధితుల సహాయ నిధికి అందించింది ఊర్వశీ రౌతేలా. తాజాగా గోవా, మహారాష్ట్ర, కేరళను తౌక్టే తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీనితో నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని స్వయంగా అందించింది ఊర్వశీ రౌతేలా. సమాజంలోని అట్టడుగు వర్గాల వారి దగ్గరకు తానే వెళ్ళి ఆహార పోట్లాలను అందించింది. అంతే కాదు… ఆకలితో ఉన్న మూగజీవుల గురించి కూడా పట్టించుకుందీ సెక్సీ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఊర్వశీ రౌతేలా ఈ యేడాది టాలీవుడ్ లోకి బ్లాక్ రోజ్
మూవీతో ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అందంతో పాటు తనకు చక్కని మనసుకూడా ఉందని నిరూపించుకున్న ఊర్వశీ రౌతేలాను నెటిజన్లు ఆకాశానికి ఎత్తుతున్నారు.