బాలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్స్ అంటే దీపికా, ఆలియా లాంటి వారి పేర్లు చెబుతారు. కానీ, నెక్ట్స్ జనరేషన్ టాప్ బ్యూటీస్ అంటే జాన్వీ, అనన్య పాండే లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. సైఫ్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా గట్టి పోటీ ఇస్తోంది బీ-టౌన్ యంగ్ బ్యూటీస్ కి.
అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అయితే, ‘అత్రంగీ రే’ మూవీ ప్రొడ్యూసర్ ఆనంద్ ఎల్. రాయ్ ఈ గార్జియస్ బ్యూటీ టాలెంట్ కి, హార్డ్ వర్క్ కి బాగానే ఇంప్రెస్ అయినట్టు కనిపిస్తోంది. సారా ‘అత్రంగీ రే’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగానే ఆమెతో మరో సినిమాకు సై అంటున్నాడు ఆనంద్. సినిమా పేరు కూడా ఇప్పటికే లీకైంది. ‘నక్రేవాలీ’ అంటున్నారు…
ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా రాహుల్ శాంకల్య దర్శకుడిగా రూపొందే ‘నక్రేవాలీ’లో హీరో సన్నీ కౌశల్ అని ప్రచారం జరుగుతోంది. హీరో విక్కీ కౌశల్ తమ్ముడే ఈ సన్నీ కౌశల్. అయితే, సారా అలీఖాన్ స్టారర్ ‘నక్రేవాలీ’లో హీరో సన్నీది డిఫరెంట్ క్యారెక్టరట! ఆడపిల్లగా డ్రెస్సింగ్ చేసుకోవటానికి ఇష్టపడే అబ్బాయి పాత్ర అంటున్నారు! చూడాలి మరి… హీరోనే హీరోయిన్ లా ముస్తాబైతే… సారా అలీఖాన్ ఇంకెలా కనువిందు చేస్తుందో!