ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘చుట్టాలబ్బాయి’తో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Read Also: హాట్ ఫోటో షూట్ : చెల్లితో కలసి రెచ్చిపోయిన ‘చిరుత’ బ్యూటీ!
ఈ సందర్భంగా ‘హైవే’ కొత్త పోస్టర్ విడుదలచేసింది యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ ‘సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీగా ‘హైవే’ రూపొందుతోంది. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అన్నారు. దర్శకుడు కేవీగుహన్ మాట్లాడుతూ ‘నా దర్శకత్వంలో మూడో చిత్రమిది. ‘హైవే’ నేపథ్యంలో సాగే సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. సైమన్ కె. కింగ్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్’ అని అంటున్నారు.