హాట్ ఫోటో షూట్ : చెల్లితో కలసి రెచ్చిపోయిన ‘చిరుత’ బ్యూటీ!

‘షరమ్ నయ్యే క్యా?’ అంటూ కస్సుబుస్సుమంటున్నారు నెటిజన్స్! ‘శర్మా సిస్టర్స్’ చేసిన పని అలాంటిది మరి! మామూలుగానే ఇద్దరమ్మాయిలు ఒకే ఫ్రేమ్ లో హాట్ హాట్ ఫోజులిస్తే జనాలు విమర్శిస్తారు. అయితే, ఈ మధ్య అలాంటివన్నీ నార్మల్ అయిపోయాయి. రోజూ ఎవరో ఒక హాట్ బ్యూటీ రెచ్చగొట్టే ఫోటోషూట్ తో ఆన్ లైన్ లో అల్లాడించేస్తోంది! కానీ, ఎంత అలవాటైనా మరీ స్వంత అక్కా, చెల్లెలు కలసి చెలరేగిపోవటం… ఎలా యాక్సెప్ట్ చేయగలరు చెప్పండి?

‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అంతటా అదృష్టం పరీక్షించుకుంది. ఎక్కడా బిగ్ స్క్రీన్ పై బిగ్ లక్ లభించలేదు. మరి లైమ్ లైట్ పక్కకు వెళ్లిపోవద్దంటే ఏం చేయాలి? సొషల్ మీడియాలో సెక్సీ ఫోటోలతో, వీడియోలతో మురిపిస్తుండాలి! అదే చేస్తోంది మిస్ నేహా…

Read Also : ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”

అక్కని మించిన అందాల ఆరబోతతో చెల్లెలు ఐషా శర్మా మరింత రెచ్చిపోతోంది. సొషల్ మీడియాలో ఇప్పుడు ఐషా కూడా కుర్రాళ్ల హాట్ ఫేవరెట్. కాకపోతే, ఇంత వరకూ నేహా, ఐషా ఇద్దరూ వేరువేరుగా ఎంటర్టైన్ చేశారు. అందరూ ఆహా అంటూ ఆనందపడిపోయారు. లెటెస్ట్ కాంబినేషన్ ఫోటోషూట్ లో మాత్రం శ్రుతి మించి మతిపోగొట్టారు అందగత్తెలిద్దరు. నేహా, ఐషా శర్మా లెటెస్ట్ హాట్ పిక్ లో ఒకర్నొకరు అతుక్కుపోయారు! కాళ్ల మీద కాళ్లు, తొడల మీద తొడలు వేసుకుని మత్తుగా కెమరాకి లుక్కులిచ్చారు! ఓన్ సిస్టర్స్ అయ్యుండీ ఈ రచ్చేంటని చాలా మంది ఆన్ లైన్ లో అప్పుడే తిట్టిపోస్తున్నారు…
నేహా శర్మా, ఐషా శర్మా జాయింట్ హాట్ ఫోటోషూట్ విమర్శలపాలైనా కొందరికి మాత్రం బాగా నచ్చింది. వావ్ అంటూ మెచ్చుకుంటున్నారు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ బోలెడు కామెంట్లు చేస్తున్నారు. మరింకేం కావాలి? తమని పొగిడినా, తిట్టినా జనం పట్టించుకోకుండా ఉండలేకపోతున్నారు! ‘శర్మా సిస్టర్స్’ అసలు టార్గెట్ ఈ ‘ఫ్రీ’ పబ్లిసిటీనే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-