ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్! ఇంకా చాలా మంది హీరోలకి బోలెడు ఇమేజ్ ఉన్నా కూడా ‘బాహుబలి’ రేంజే వేరు! కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా త్రివిక్రముడిలా పెరిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తరువాత ‘సాహో’ మరింత ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది మన టాల్ అండ్ టాలెంటెడ్ స్టార్ కి! అయితే, రాబోయే చిత్రాలు ‘డార్లింగ్’ని మరింత డేరింగ్ గా ప్రజెంట్ చేయబోతున్నాయి…
ప్రభాస్ నెక్ట్స్ రిలీజ్ ‘రాధేశ్యామ్’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డేతో జోడీ కట్టాడు ‘ఏక్ నిరంజన్’. ఇక ‘రాధేశ్యామ్’ లాంటి ప్యాన్ ఇండియా రొమాంటిక్ సాగా తరువాత ‘ఆదిపురుష్’గా రాబోతున్నాడు ఆజానుబాహుడు. శ్రీరాముడిగా… ఎపిక్ మూవీలో చూసే వార్ని స్పెల్ బౌండ్ చేయబోతున్నాడు. ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్ ఫిలిమే! అయితే, ‘ఆదిపురుష్’ తరువాత మన ముందుకు రాబోతోన్న ‘ప్రాజెక్ట్ కే’ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది! కారణం, నాగ్ అశ్విన్ మాస్టర్ పీస్ ఎవరూ ఊహించనంత భారీగా ఉండబోతోందట!
ప్రభాస్ తో పాటూ దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ లాంటి ఆలిండియా స్టార్స్ ని మనం నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’లో చూడబోతున్నాం. భారీ తారాగణమే కాదు 400 కోట్ల భారీ బడ్జెట్ కూడా సినిమా కోసం కేటాయించారట. ప్రభాస్ మూవీస్ లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం కాబోతోంది. ఇక బిగ్ బి, దీపికా లాంటి బిజీ బాలీవుడ్ స్టార్స్ కూడా బల్క్ డేట్స్ ఇస్తున్నారు నాగ్ అశ్విన్ మీద నమ్మకంతో. హీరో ప్రభాస్ అయితే ఏకంగా 200 రోజులు కేటాయించాడట! గతంలో ‘బాహుబలి’ ఫ్రాంఛైజ్ కోసం మన ‘ఛత్రపతి’ ఎన్ని సంవత్సరాలు అంకిత భావంతో పని చేశాడో గుర్తుంది కదా! అదే రేంజ్లో ‘ప్రాజెక్ట్ కే’ మీద గురి పెట్టబోతున్నాడట! చూడాలి మరి, తన రాబోయే ప్యాన్ ఇండియా సూపర్ మూవీస్ తో ప్రభాస్ ఇంకా ఎలాంటి రేంజ్ కి ఎదుగుతాడో…