ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్! ఇంకా చాలా మంది హీరోలకి బోలెడు ఇమేజ్ ఉన్నా కూడా ‘బాహుబలి’ రేంజే వేరు! కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా త్రివిక్రముడిలా పెరిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తరువాత ‘సాహో’ మరింత ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది మన టాల్ అండ్ టాలెంటెడ్ స్టార్ కి! అయితే, రాబోయే చిత్రాలు ‘డార్లింగ్’ని మరింత డేరింగ్ గా ప్రజెంట్ చేయబోతున్నాయి… ప్రభాస్…