తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ రెచ్చిపోయారు. సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు.
KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల.
కేంద్రం వడ్లు కొనకున్నా మేము మొనగాళ్లం వడ్లు కొంటాం అన్న కేసీఆర్ గారికి కల్లాల్లో తడుస్తున్న వడ్లు, కన్నీరు పెడుతున్న రైతు కనపడటం లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా ఎన్నిరోజులు మీ జూటా మాటలు? వడ్లు కొంటామని చెప్పి నెలరోజులైనా కొన్న వడ్లు ఎన్ని? నీ రాజకీయాలకు రైతులను ఇంకెన్ని రోజులు గోస పెడ్తరు?
గడి గడపదాటి బయటకొచ్చి రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? అని ప్రశ్నించారు. రైతు గోస వినపడ్తలేదా?చేతగాక పెడచెవిన పెడుతున్నావా?లేక మొద్దునిద్ర పోతున్నావా ? అని ఫైర్ అయ్యారు. అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్న మీరు….పంట కొనుమని అధికారులను ఎందుకు కల్లాలకు పంపడం లేదు? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ఇప్పటికైనా రైతును గోస పెట్టకుండా చూడండని.. తడిచిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా,కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధరిచ్చి అంతా కొనాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల.
కాగా.. వరంగల్ ను గుడిసెలు లేని నగరం చేస్తానని చెప్పి 7 ఏండ్లు గడిచింది కానీ ఇండ్లు మాత్రం కట్టివ్వలేదని షర్మిళ ప్రశ్నించారు. మీ మాట నెరవేరకపోతే మీ తలకాయ కిందపడలే కానీ పేదోళ్లు కిరాయిలు కట్టలేక వీధిన పడ్డారని మండి పడ్డారు. KCR అందరి లెక్క వచ్చి పోయే ముఖ్యమంత్రి కాదు ఎవరు చేయని మోసం చేసే పచ్చి మోసగానివని తిరగబడుతున్నరని విమర్శించారు వైఎస్ షర్మిళ.