జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక,…
ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్‌నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. వాస్తవంలో…
ప్రగతిభవన్ లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ఈ సందర్భంగా తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్… పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. read also : ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్లాన్‌లో ఎమ్మెల్సీ తోట! కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైనా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్.…
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం అతిపెద్ద హాట్‌టాపిక్ జల వివాదం. ఎవరి వ్యూహాలు వారివే. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి సహకరించేలా గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? ఓ కీలక అధికారే అలాంటి గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిస్తే..!? రియాక్షన్ ఊహించలేం. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న ఆ ఆఫీసర్‌ను కంట్రోల్ చేయలేకపోతే కష్టమంటున్నాయి ఏపీ ఇరిగేషన్ వర్గాలు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. జలవివాదంలో పక్క రాష్ట్రానికి గూఢచర్యం? కొందరు అధికారులు అవినీతికి పాల్పడితే.. ఇంకొందరు విధి నిర్వహణలో…
కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది.. రేపు జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది కేఆర్‌ఎంబీ.. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంతో కీలకంగా మారింది కేఆర్ఎంబీ సమావేశం… ఈ విషయంలో ఇప్పటికే కేఆర్‌ఎంబీకి లేఖలు కూడా వెళ్లాయి.. అయితే, కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా?…