Jagtial Crime: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భీమునిదుబ్బ ప్రాంతంలోని ఓ ఇంట్లో అక్క మృతి చెందగా.. అదే సమయంలో సోదరి అదృశ్యమైంది. ఇంట్లో మద్యం సీసాలు కనిపించడం, సోదరి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే చెల్లెలే హత్య చేసి పరార్ అయ్యాదా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కకు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, డబ్బుల విషయంలో లేక సోదరి ఎవరినైనా ప్రేమించడం వల్ల ఈ హత్య చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతురు హత్య విషయం తెలిసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
Read also: Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
భీమునిదుబ్బ ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారికి సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితిలో పడి ఉంది.
Read also: Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో రాహుల్ హత్య కేసు.. ప్రేమ వ్యవహరమే కారణమా?
వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. అనంతరం స్థానిక సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి. చెల్లి చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డయింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దీప్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చందనం ఎక్కడికి పోయింది? ఆమెను వెంబడిస్తున్న యువకుడు ఎవరు? ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? మరెవరైనా మద్యం సేవించారా? ఆ యువకుడితో చందన ఎందుకు పారిపోయింది? దీప్తి హత్య చేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెల్లి చందన, తనతో వున్న యువకుడు దొరికితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
Goa: అందాలను ఎరవేసి.. పైసల కోసం పెద్దలకు కుచ్చుటోపీ