Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin Says Pakistan is favourites in Asia Cup 2023: మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ తెరలేవనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్ గత 5-6 ఏళ్లుగా పటిష్ఠంగా మారడానికి ఇద్దరు ప్లేయర్స్ కారణమని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘పాకిస్థాన్ జట్టును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 5-6 ఏళ్ల క్రితం పాక్ మెగా టోర్నీల్లో ఇబ్బందిపడేది. ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో పేలవ ప్రదర్శన చేసేది. ఐసీసీ ట్రోఫీలను గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ.. కొంతకాలం కిందట వరకు పాకిస్థాన్ బాగా ఆడేది కాదు. అయితే గత ఆరేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. అందుకు కారణం బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో పాక్ అద్భుతంగా పుంజుకుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం వారికి కలిసొచ్చింది’ అని అన్నాడు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
‘పాకిస్తాన్ జట్టును ఎంపిక చేసుకొనే తీరు బాగుంది. అద్భుత ఫాస్ట్ బౌలర్లను తయారు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మంచి బౌలర్లు ఉనారు. అలానే 90ల్లో ఉన్న మాదిరిగా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. పీఎస్‌ఎల్‌తో పాటు బీబీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడుతున్నారు. టెస్టు క్రికెట్‌ను కూడా ఎక్కువగానే ఆడటంతో ప్రయోజనం కలుగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో కఠిన పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన అనుభవం పాక్ ఆటగాళ్లకు ఉంది. ఎమిరేట్ లీగ్, యూఎస్‌ఏ, కెనడా, సీపీఎల్ లాంటి లీగ్‌లలో ఆడడం వల్ల ఆటగాళ్లలోని టాలెంట్ బయటికొస్తుంది’ అని యాష్ చెప్పాడు.
Also Read: iPhone 15 Launch 2023: ఇట్స్ ఆఫీషియల్.. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 లాంచ్! ధర మాత్రం చుక్కలే
‘పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఆసియా కప్ 2023లో ఎక్కువగా శ్రీలంక వేదికగానే మ్యాచ్‌లు జరగనున్నాయి. లంక ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచే ఉన్నారు. కాబట్టి వారికి ఇది కూడా సొంత మైదానాల కిందే లెక్క. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో అన్ని జట్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఆర్ అశ్విన్ సూచించాడు.
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!