Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో రాహుల్ హత్య కేసు.. ప్రేమ వ్యవహరమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendra Nagar: నగరంలోని రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలోని ధూల్ పేటకు చెందిన రాహుల్ సింగ్ మణికొండలోని అలీజాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని నివాసానికి సమీపంలోని జిమ్ నుండి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు అతని కళ్లలో పెప్పర్ స్ప్రే చెల్లి రాహుల్ సింగ్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. రాహుల్ సింగ్ తన బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహరం నడిపారు. అయితే పెళ్లి విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే రాహుల్ సింగ్ హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ సింగ్ మధ్యవర్తులను ఆశ్రయించినట్లుగా ప్రచారం సాగుతోంది.
Read also: Gabon: గాబన్‌ని స్వాధీనం చేసుకున్న ఆ దేశ సైన్యం.. సంక్షోభంలో ఆఫ్రికా దేశం..
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
రాహుల్ సింగ్ హత్యలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాహుల్ సింగ్‌ను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్ సింగ్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారనే దానిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అన్న వికాస్ కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నాడు. రాహుల్ కి జిమ్, ఇళ్ళు తప్పా మరొకటి తెలియదని అన్నారు. మా బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉండేదని తెలిపారు. పెళ్ళి చేసుకోకపోవడంతో నా తమ్ముడి పై పగ పెంచుకుందని తెలిపారు. వైషికా, మరో వ్యక్తి కలిసి మా తమ్ముడిని చంపారని అన్నారు. మొత్తం నలుగురు జిమ్ దగ్గరికి వచ్చి కత్తితో పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్వాన్ కు చెందిన అజహర్ కు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడని తెలిపాడు. ఆ డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఉదయం అజహర్, రాహుల్ కి ఫోన్ చేసి మాట్లాడాడని తెలిపారు. ఆ తరువాతే రాహుల్ హత్య జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నా తమ్ముడు రాహుల్ ని చంపిన నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారని అన్నారు. వైషికా ఆమె తల్లి ఇద్దరు కూడా కనిపించడం లేదని వెల్లడించారు. మరి వైషికా.. రాహుల్ ను ప్రేమించి ఉంటే తననే ఎందుకు చంపాలని అనుకుంది? రాహుల్ వేరే అమ్మాతో ప్రేమ వ్యవహారం నడిపాడా? అది నచ్చకనే వైషికా నే ప్లాన్ ప్రకారం.. రాహుల్ ను చంపేసి పరార్ అయ్యాందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gabon: గాబన్‌ని స్వాధీనం చేసుకున్న ఆ దేశ సైన్యం.. సంక్షోభంలో ఆఫ్రికా దేశం..
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!