Peddapallai: పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం జరిగింది. రేషన్ డీలర్ గా పనిచేస్తున్న ఓ మహిళను అతికిరాతకంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన జరిగి మూడురోజులు కావస్తున్న ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బందెల రాజమణి మృతురాలిగా గుర్తించారు.
మంథని మండల పరిధిలోని లక్ష్మీపూర్‌లో రేషన్ డీలర్‌గా బందెల రాజమణి పనిచేస్తున్నారు. రాజమణికి నలుగురు పిల్లలు. ఆమె భర్త నాలుగేళ్ల కిందటే చనిపోయాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ సంతోష్ అనే వ్యక్తితో బందెల రాజమణి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే బందెల రాజమణికి సంతోష్ డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. పైడాకుల సంతోష్ మంథని ఎరుకల గూడెంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం ఏం జరిగిందో తెలియదు డబ్బుల విషయంలో బందెల రాజమణిపై సంతోష్ దాడిచేసినట్లు తెలుస్తుంది. అయితే సంతోష్ తన చేతిలోవున్న కత్తిని తీసుకుని బందెల రాజమణిపై దాడి చేశాడు. అతి కిరాతకంగా గొంతుకోసి పరారయ్యాడు. అయితే ఇంటికి వచ్చిన బందెల రాజమణి సోదరుడు ఇంటి తలుపులు కొట్టిన డోర్ తెరవకపోవడంతో దీంతో అతను అనుమానం వచ్చి తలపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాడు. ఆమె విగతజీవిగా పడివుండటాన్ని చూసి షాక్ తిన్నాడు. సంతోష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతోష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసమే హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజమణి హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Minister KTR: ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా.. కేటీఆర్ ట్విట్ వైరల్