Minister KTR: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీరక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేవారు. ఉన్నత చదువుల కోసం హిమాన్షు ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లినప్పుడు మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో ఓ ఫొటో పోస్ట్ చేసి తన కుమారుడిని గుర్తు చేసుకున్నారు. హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్, ‘ఈ పిల్లవాడిని మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ క్యాప్షన్ పక్కన లవ్ సింబల్ కూడా పెట్టారు. దీంతో ఎంత మంత్రి అయినా.. ప్రజలకోసం పనిచేస్తూ తన కుమారుడ్ని తలచుకుంటూ.. మరోపక్క ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కాగా.. హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలో డిగ్రీని అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత సీఎం కేసీఆర్, నాయనమ్మ శోభ, తల్లిదండ్రులు కేటీఆర్, శతిలమ, సోదరి అలేఖ్య హాజరయ్యారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఆగస్టులో అమెరికా వెళ్లాడు. మంత్రి కేటీఆర్ దంపతులు స్వయంగా అమెరికా వెళ్లి కళాశాలలో అడ్మిషన్ ఇప్పించారు. అప్పుడు కూడా మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నిన్నటి వరకు అల్లరి చేస్టలు చేస్తూ తిరిగే పిల్లాడు ఇంతలోనే పెద్ద కాలేజీకి వెళుతుందంటే నమ్మలేకపోతున్నా అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. హిమాన్షు ఒంటరిగా అమెరికా వెళ్లడం లేదు. నాలో సగ భాగం తీసుకుపోతున్నాడు అంటూ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ తాజా ట్వీట్‌ను ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు రీట్వీట్ చేస్తున్నారు. పిల్లలను విడిచిపెట్టడం తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని. వాళ్ల బాధ వాళ్లకే తెలుసంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎప్పుడైతే మన ఎదురుగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతారో, మంచి ప్రయోజకులు కావాలంటే భావితరాలకు విదేశాలకు పంపాలని వ్యాఖ్యలు చేస్తున్నారు.
Missing this kid ❤️ pic.twitter.com/3I8uwdjlxW
— KTR (@KTRBRS) October 10, 2023
Disha Patani Pics: చెమటలు పట్టిస్తున్న ‘దిశా పటాని’ హాట్ అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!