Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. ఇది పాడి పశువుల ఫెస్టివల్.. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత చెప్పుకుంటారు. పండించిన పంటను పశుపక్ష్యాదులతో పంచుకోవాలని ఉద్ధేశ్యంతో పిట్టల కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను అన్నదాతలు కడతారు. ఇక, కనుమ రోజు కాకులు అయినా కదలదనే సామెతను గుర్తు చేస్తూ.. ఈ రోజు ప్రయాణాలు చేయొద్దని పూర్వీకులు చెబుతుంటారు.
Read Also: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
అయితే, పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా భావిస్తారు.. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఆనందం. కాగా, కనుమ పండుగను పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తిగా విశ్రాంతిని కల్పిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదనే ఆచారం వెనుక ఓ గొప్ప విషయం ఇమిడి ఉంది. వాస్తవానికి పూర్వకాలంలో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవారు. దీంతో కనుమ రోజున కాకి అయినా కదలదు అనే సామేత వచ్చింది.
Read Also: Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
కాగా, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ సమయంలో వచ్చిన బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా అందరితో ఆనందంగా గడిపేందుకు.. కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలను పంచుకొవడానికి వీలుగా కూడా ఈ నియమం పెట్టారని కూడా చెప్పొచ్చు. అయితే, తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల గురుగుల నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. కొత్తగా పెళ్లైన వారు.. ఈ పండగ సమయంలో మట్టితో చిన్న పాత్రల్ని తయారు చేసుకుని అందులో బెల్లం-నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, చిల్లర, రేగుపళ్లు, జీడిపళ్లు లాంటివి పెట్టి తాంబూలంగా ఇవ్వడం అక్కడి సంప్రదాయంగా వస్తుంది.