1. నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఉదయం 10.20గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జనగ్ చేరుకుంటారు.
2. నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేస్తారు.
3. నేడు రాయలసీమలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. పీలేరు, బాకరాపేట, రంగంపేట, తిరుపతి బైపాస్, రేణిగుంటలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
4. నేడు తెలంగాణలో అతిభారీ వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
5. నేడు ఇంగ్లాండ్-భారత్‌ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. సౌథాంప్టస్‌లో రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
6. నేడు ఉదయం 8గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. బదీలు, ఇతర సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.
7. నేడు పంజాబ్ సీఎం భగవత్ మాన్ వివాహం జరుగనుంది. చండీగఢ్ సెక్టార్ 8లోని గురుద్వారలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.