1.నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.63,500లుగా ఉంది.
2. నేడు పంజాబ్ కేబిన్ విస్తరణ జరుగనుంది. కొత్తగా మరో ఐదుగురికి చోటు దక్కే అవకాశం ఉంది.
3. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏకనాథ్ షిండే ప్రభుత్వానికి బలపరీక్ష జరుగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు.
4. నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు.
5. నేటి నుంచి రాష్ట్రాల పర్యటనకు ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు. నేడు జార్ఖండ్ వెళ్లనున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము. రేపు బీహార్ పర్యటనకు వెళ్లనున్న ద్రౌపది ముర్ము.