Bandi sanjay: మేం అధికారంలోకి వచ్చాక.. సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లిలో పేదల భూములను కబ్జా చేశారని, వారి పైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 11 వేల మీటింగ్ లు పెడతాం… బహిరంగ సభలు కాదని ఎద్దేవ చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ మీటింగ్ లు అని బండిసంజయ్ అన్నారు. సీఎం ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారని తెలిపారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుందని, హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకం అయ్యి బీజేపీకి మేయర్ కాకుండా చేశారని ఆరోపించారు.
Read also: CM KCR: అడవి బిడ్డలం అయితే.. అడవి అంతా కొట్టేస్తారా
అన్ని కేంద్రమే ఇస్తుంది. కేంద్రం ఏమి ఇవ్వడం లేదని అంటున్న కేసీఆర్ హైదరాబాద్ కు ఏమీ చేశావో చెప్పు? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ జై తెలంగాణ అంటలేదు… తెలంగాణ పదాన్ని మరిచాడని మండిపడ్డారు. కేసీఆర్ ఎక్కడి కి వెళ్ళిన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఎంత మందికి డబల్ బెడ్రూం లు ఇచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. సీఎం సహకరించడం లేదని, రోడ్డుకు అడ్డం ఉంటే మస్జిద్ లు, గుడిలు కులుస్తాము అంటున్నారని బండిసంజయ్ పేర్కొన్నారు. దమ్ముంటే ఓల్డ్ సిటీ లో మస్జిద్, గుడులు ఉంటే ముందు కూల్చు అంటూ సవాల్ విసిరారు. అక్కడ రోడ్లు అలా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అసెంబ్లీ లో BRS, MIM కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. ఓవైసీ కి సెక్రటేరియట్ సమాధి లెక్క కనిపిస్తుంది ఆట..తెలంగాణ ను mim కి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు బండిసంజయ్. BRS, MIM కలిసి పోటీ చేయాలి… డిపాజిట్ రాకుండా చేస్తామమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఛార్జ్ లను పెంచారని, అయ్యా కొడుకుల లెక్క భూములు కబ్జా చేయలేదని మండిపడ్డారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టి తమ కుటుంబం బాగు పడాలని చూసుకుంటున్నడూ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు బండిసంజయ్.
Formula E Racing: ‘ఫార్ములా-ఇ’ రేసు.. అలరించనున్న సాగరతీరం..