మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దృశ్యం 2 కు కొనసాగింపుగా దృశ్యం 3 చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూడో భాగం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్..
Also Read : Salman khan : ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన సల్మాన్..
తాజాగా మోహన్ లాల్ ఒక స్పెషల్ వీడియో ద్వారా ‘దృశ్యం 3’ కి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ లాల్ పేర్కొన్నట్టు ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని మునుపటి భాగాలలాగే ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించనున్నారు. మళ్లీ అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మేజిక్‌ను చూపించేందుకు టీం రెడీ అవుతోంది.
October 2025 — the camera turns back to Georgekutty.
The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO
— Mohanlal (@Mohanlal) June 21, 2025