Boianapalli Vinod Kumar: కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశామన్నారు.
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి టెండర్ పిలిస్తే బిహెచ్ఇఎల్ పాల్గొందని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిహెచ్ఇఎల్ ఎవరి ఆధీనంలో ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బండికి ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఏముందో చూసుకొని మాట్లాడాలన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్కు టెండర్లు అప్పగించామని, ప్రపంచవ్యాప్తంగా బిహెచ్ఇఎల్కు మంచి పేరు ఉందన్నారు. బిహెచ్ఇఎల్కు టెండర్ వస్తే ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగారని, బిహెచ్ఇఎల్ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ పని అప్పగించారని వినోద్ కుమార్ తెలియజేశారు. బిహెచ్ఇఎల్ ఇచ్చిన సామాగ్రి తుప్పు పట్టిన సామాగ్రినా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు. కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని చురకలంటించారు. ఎంపిగా ఉండి బండికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కువ ధరలకు కంరెంట్ కొంటున్నారనేది పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. బండికి ఎ, బి, సి, డిలు కూడా తెల్వదని తమకు అర్థమైందని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్ర సిఎండి లేఖ రాశారని, రూ.6.76 నుంచి రూ.12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని బి వినోద్ కుమార్ గుర్తు చేశారు.
Prabhas: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. నెక్ట్స్‌కి ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!