Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే వీళ్లకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే వచ్చాయి. వీళ్లు కూడా అదే గ్లామర్ సరిపోతుంది అనుకున్నారు. ఇప్పటి వరకు వీళ్లు చేసిన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే ఉన్నాయి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలే లేవు.
Read Also : Mahesh Vitta : తండ్రి అయిన పాపులర్ కమెడియన్..
అదే వీళ్లు చేసిన పెద్ద మిస్టేక్. అందుకే వీళ్లకు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. ఇప్పటికే నభానటేశ్, కృతిశెట్టి, పూజాహెగ్డే లాంటి వాళ్లను ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. శ్రీలీల మొన్నటి దాకా గడ్డుకాలం వెల్లదీసింది. గ్లామర్ ను మాత్రమే నమ్ముకుంటే మహా అయితే టైమ్ బాగుంటే ఓ పది సినిమాల దాకా ఛాన్సులు వస్తాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి. అందుకే నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. గ్లామర్ ను చూపించడానికి ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ నటన పరంగా గుర్తింపు తెచ్చుకుంటేనే ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిపల్లవి, కీర్తి సురేష్ లాంటి వారే. వీరు గ్లామర్ కంటే ట్యాలెంట్ నే నమ్ముకున్నారు. అందుకే వాళ్లకు ఇప్పటికీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రేక్షకుల్లో వారికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అది వాళ్ల గ్లామర్ ను చూసి కాదు.. వాళ్ల ట్యాలెంట్ ను చూసి. గ్లామర్ ను చూపించే పాత్రలు పెద్ద సినిమాల్లో వచ్చినా వాళ్లు చేయరు. వాళ్ల పాత్రలకు నటించే స్కోప్ ఉంటేనే ఒప్పుకుంటారు. అదే వాళ్లను ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇప్పటికీ వాళ్ల దగ్గరకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తోంది. వీళ్ల కెరీర్ లోనూ ప్లాపులు ఉన్నాయి. కానీ అది వాళ్ల అవకాశాలను దెబ్బ తీయలేదు. కాబట్టి శ్రీలీల, భాగ్య, నభా నటేశ్, కృతిశెట్టి, పూజాహెగ్డే లాంటి వాళ్లు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తేనే బెటర్.
Read Also : Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?