ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలి: విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలంటూ విజయశాంతి తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా చేయడానికే, ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి మండిపడ్డారు. డప్పుల దరువులతో రైతుబంధును జాకీలతోని లేపాలే అన్నట్టుగా… మీడియా కవరేజ్ మిస్ గాకుంట జూడాలే అన్నట్టుగా వారం రోజుల నుండి రైతుబంధు రాజకీయ విన్యాసాలకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్టు…కరోనా నిబంధనల్ని కాళ్ల కింద వేసి తొక్కి మరీ చారణ కోడికి బారాణ మసాలా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అసలు ఈ రైతుబంధు వారోత్సవాలు ఎందుకోసం? అని ప్రశ్నించారు.
Read Also: పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
Also Read
రైతులకు రూ. లక్ష లోపు ఉన్న పంట రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేయనందుకా? లేక 2018 ఎన్నికల ముందు రైతులందరికి ఉచితంగా ఎరువులు ఇస్తానని ఇయ్యనందుకా? పోనీ ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయందుకా? ఎందుకు ఈ రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నల్గొండ జిల్లాలో ఓ యువ రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ… రుణమాఫీ చేసి ఉంటే బ్యాంకులో అప్పు పుట్టి మళ్లీ వ్యవసాయం చేసుకొనేవాడినని… రుణమాఫీ చేయకపోవడంతోనే తన భూమి అమ్ముకున్నానని నిరసన తెలుపుతుంటే… అధికారపార్టీ నేతలు తనని అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ విర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్ రైతులను కూడా మోసగించాలని చూస్తోందన్నారు. రైతులు మోసపోయే స్థితిలో లేరంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలు చావు దెబ్బ కొడతారంటూ హెచ్చరించారు.
- Tags
- bjp
- kcr
- political news
- telangana
- TRS
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..