Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మాట్లాడిన మాటలు వింటుంటే సైకో లాగా, శాడిస్ట్ లాగా ఉందే తప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలకు ఎండిపోతున్న పొలాలకు నీళ్లు పారించమని ప్రతిపక్షాలు కోరుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు బూతులు పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో కేవలం అబద్ధాలు, బూతులు, శాపనార్థాలు తప్ప మరేమీ కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
పొలాలకు నీళ్లు పారించమంటే.. ప్రతిపక్షాల రక్తం పారిస్తాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రతిపక్షాల రక్తం అడుగుతారా? ప్రజల కోసం అవసరమైతే మా రక్తం ఇస్తాము. నిన్న షాబాద్‌లో జరిగిన ఘోర ఉదంతంలో నరహంతకుడైన రాజ్‌కుమార్‌కు, ఇలా రక్తం పారిస్తామంటున్న ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటి?” అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ఇలాంటి అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి షాబాద్ దారుణ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే, మన రాష్ట్ర సీఎం మాత్రం దానిపై నోరు మెదపకుండా రాజకీయ విమర్శలు, బూతులు మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన అసభ్యకర వ్యాఖ్యలను ఒకసారి టీవీల్లో రివైండ్ చేసి చూసుకోవాలని, ఆ మాటలు విన్న తర్వాతైనా ఆయన రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “నీకు మా రక్తం కావాలా.. అయితే తీసుకో, దానికి మేము సిద్ధం. కానీ ఎండిపోతున్న రైతుల పొలాలకు మాత్రం తక్షణమే సాగునీరు పారించు” అని కోరారు.
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!