జాతీయ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి క్రమశిక్షణ తెలిసిన బీజేపీలో ఎవరికైనా ఎట్లా ఉంటది? అని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయ శాంతి. ఇవాళ ఆమె ట్విట్టర్ వేదికగా ‘బీజేపీని బలహీనపర్చటానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమైన ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు. ఈడీ, సీబీఐ కేసులు, అరెస్టులు ఆ ప్రభుత్వ విభాగాల నిర్ణయాధికారం. ఆ అరెస్ట్‌లు ఎందుకు జరగలేదని దేశ హోంమంత్రి గారిని ఎవరైనా అడిగినట్లు వార్తలు వస్తే.. అది సంపూర్ణ అవాస్తవం. అంతా పక్కనే ఉండి చూసినట్టుగా వెలువడిన కథనాల వల్ల సదరు మీడియా విశ్వసనీయత కోల్పోవడం తప్ప చెయ్యగలిగేదేమీ లేదు. ఏది ఏమైనా ఈటల గారు, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీతోనే కొనసాగుతామని చెప్పిన అంశాన్ని బీజేపీ వ్యతిరేకులు కనీసం విని, మీడియా దుష్ప్రచారాన్ని ఇకనైనా మార్చుకోగలరని విశ్వసిస్తున్నాము.’ అని ట్విట్ చేశారు.
Also Read : Tragic Accident: హోటల్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి, డీకే అరుణ లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేకు మతి భ్రమించినట్లుంది. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుంది. క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత’ అని ఘాటుగా స్పందించారు విజయశాంతి.
Also Read : Tragic Accident: హోటల్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి