Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో నాగేంద్రన్.. సీఎం విజయ్ గతంలో చేసిన ‘నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీలో నాన్న ఎక్కడ.. నాన్న ఎక్కడ అని వెతికితే ఎలా తెలుస్తుంది. ఇంటికి వెళ్లి అడిగితేనే తెలుస్తుంది’ అంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సీఎం విజయ్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా ఉన్నాయంటూ డీఎంకే, కాంగ్రెస్, టీవీకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం సరికాదంటూ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సైతం నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ నేత ఖుష్బూ కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్.. నాగేంద్రన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
మరోవైపు ఈ వ్యవహారంపై టీవీకే కార్యకర్త, న్యాయవాది వర్తిని డీజీపీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు, పోస్టులను ఆధారాలుగా సమర్పించినట్లు సమాచారం. దీంతో తమిళనాడులో విజయ్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?