తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పీసీసీ నియామకంపై పెద్ద రచ్చ నడుస్తోంది. పీసీసీ నాకంటే నాకు అని.. సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ నియామకంపై మరోసారి విహెచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే.. మా ఆత్మగౌరవం దెబ్బతింటదని విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొత్త వారికి ఇచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తే.. పరిణామాలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా.. అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని.. ఇప్పుడు కొత్త పీసీసీ నియమించబోతున్నారన్నారు.
కర్ణాటకలో కొత్త పీసీసీ కోసం పరిశీలకుడిని పంపించారని.. ఇప్పుడు పంజాబ్ లో కూడా అదే జరుగుతోందని.. తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించబోరని ప్రశ్నించారు. మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తడా?ఈ రోజు.. తెలంగాణలో పీసీసీ కోసం బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని మండిపడ్డారు.ఇది జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతినదా.. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటి?పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలన్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీలు వస్తే వారి పార్టీ కోసం కష్టపడుతున్నారు.. కానీ మా పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయడని ఫైర్ అయ్యారు.