‘మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు. చార్మినార్…
రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
భట్టి పాదయాత్ర చరిత్రాత్మక విషయమని వీహెచ్ కొనియాడారు. భట్టి పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. బీసీ ప్రధాని అయినా.. బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. కులాల వారిగా జనాభా గణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారని వీహెచ్ అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మంలో 10 సీట్లు కాంగ్రెస్ దే అన్నారు. రేవంత్, భట్టి కలిసి పని చేయాలని ఆయన అన్నారు.…
బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు.
Telangana Congress: గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదిక అయ్యింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
రాష్ట్ర నేతల అనుభవం ముందు ఇంఛార్జ్ ఠాగూర్ తేలిపోతున్నారా? మాణిక్యం ఠాగూర్. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. తెలంగాణ వరకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు ఠాగూర్ గురించి ఏదేదో అనుకున్నారు. కానీ.. పార్టీ నాయకులను ఆయన గాడిలో పెట్టలేకపోతున్నారని తెలియడానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఇందుకు ఠాగూర్ అనుభవ రాహిత్యం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అనుభవం ముందు తేలిపోతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమాండింగ్ లేదు.. కంట్రోలింగ్ అంతకంటే…
150 ఏళ్ళ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపి అనంతరం దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఇప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు ఉండకూడదు.. అంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ అధిష్టానం, రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.. కానీ, మరోసారి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఆయన విమర్శలకు ప్రధాన కారణం అంబేద్కర్ విగ్రహమే.. అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఎత్తుకు పోయారు అని కేసులు పెట్టినా.. ఇప్పటి వరకు చార్జిషీట్ వేయలేదని…