Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని…