టాలీవుడ్ లోకి మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీ జరగబోతుంది. తన మాస్ సినిమాలతో మాస్ మహారాజ్ బిరుదు అందుకున్న రవితేజ ఫ్యామిలీ నుండి వారసుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అయితే రవితేజ కొడుకు కాదులెండి. ఆయన తమ్ముడులో ఒకరైన రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. వాస్తవానికి తన మొదటి సినిమాగా మిస్టర్. ఇడియట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాను హోల్డ్ లో పెట్టేసారు.
Also Read : Rishab Shetty : కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
ఇప్పుడు మాధవ్ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాకు డెబ్యూ దర్శకుడు నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘మారెమ్మ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. మోక్ష ఆర్ట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ను ఈ ఏడాది దసరా కానుకగా రిలిజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఆగస్టులో ‘మారెమ్మ’ గ్లిమ్స్ రిలీజ్ కానుంది. యంగ్ హీరోపై మేకర్స్ భారీ గానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. తమ హీరో ఫ్యామిలీ నుండి రాబోతున్న హీరో కావడంతో మహామహారాజ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుండి రాబోతున్న మాధవ్ పెద్దనాన్న రవితేజ లా నటించి మెప్పించి స్టార్ హీరోగా ఎదగాలని ఆశిద్దాం. మారెమ్మతో మాధవ్ ఏ మేరకు గుర్తింపు తెచుకుంటాడో చూడాలి.