VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో క్రమంగా వీడియోలను తొలగించాయి.
Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు
వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో, ముఖ్యంగా మైనర్‌లను జోడించి అసభ్య కంటెంట్ రూపొందించే క్రియేటర్లను లక్ష్యంగా చేసారు. ట్వీట్‌లో “ఇలాంటి కంటెంట్ త్వరలో తొలగించబడకుంటే భవిష్యత్‌లో చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాము” అని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. సజ్జనార్ హెచ్చరిక తర్వాత.. అనేక యూట్యూబ్ ఛానెళ్లు తమ వీడియోలను తక్షణమే డిలీట్ చేసాయి. వాటితోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా డిలీట్ చేయడం ప్రారంభించారు. సజ్జనార్ ఇచ్చిన హెచ్చరిక.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు, బాధ్యతలపై స్పష్టత కలిగించింది. క్రియేటర్లకు, సామాజిక బాధ్యతను గుర్తించి, చట్టాన్ని గౌరవించమని ఈ హెచ్చరిక సూచిస్తోంది.
Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని
వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!?
వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!?
చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా… pic.twitter.com/flvJeg4EHy
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2025